
ఈవీవీ సత్యనారాయణ మార్కు కామెడీ అనగానే మనకు గుర్తొచ్చేది కడుపుబ్బా నవ్వించే సంభాషణలు, నటీనటుల అద్భుతమైన టైమింగ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బురిడి' సినిమాలోని ఒక అద్భుతమైన కామెడీ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా దివంగత నటులు జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల మధ్య సాగే ఈ సన్నివేశం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఇద్దరూ డ్యూయల్ రోల్ పోషించడం విశేషం.
వైరల్ వీడియో క్లిప్‌లో తల్లీకూతుళ్ల( తెలంగాణ శకుంతల డ్యూయల్ రోల్) మధ్య కాలేజీ ఫీజు గురించిన చర్చ జరుగుతుంది. "ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయకూడదన్నారు మమ్మీ, నా ఫ్రెండ్స్ త్రిషా, చార్మీ నన్ను ఎక్కిరిస్తున్నారు" అంటూ కూతురు అమాయకంగా బాధపడుతుంది. "మన పేద బతుకులు ఇంతే. అయ్యగారిని అడుగుదాం అంటే అసలే నా వల్ల కాలు జారారు" అని తల్లి అనగానే.. "ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధి మమ్మీ" అంటూ కూతురు షాక్ అవుతుంది. "ఛీ ఛీ ఆ కాలు జారడం కాదు.. నీళ్ల మీద లెగ్ వేశారు" అంటూ తల్లి అసలు మేటర్ చెబుతుంది.
ఈ క్రమంలో జయప్రకాష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ఓ రేంజ్‌లో బిల్డప్ ఇవ్వడం సీన్‌కే హైలైట్‌గా నిలిచింది. కూతురి చదువు కోసం తెలంగాణ శకుంతల బాధపడుతుంటే, జయప్రకాష్ రెడ్డి మధ్యలోకి వచ్చి ఎమోషనల్ డైలాగులతో డ్రామా స్టార్ట్ చేస్తాడు. "పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్‌లోకి ఎంటర్ అయిన ఈ పిల్లను సెంటర్‌లో ఆపేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనకాల ఈమె పొడిగుడ్డ పెడుతూ రావాలా?" అంటూ ఆయన చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తాయి. 1000 రూపాయల ఫీజు కోసం అంత పెద్ద డైలాగులు కొట్టి, తీరా జేబులోంచి కేవలం వంద రూపాయల నోటు తీసి ఇవ్వడం ఈ సీన్‌లో అసలైన ట్విస్ట్. ఆ తర్వాత తెలంగాణ శకుంతల చెప్పడంతో.. మళ్ళీ వెయ్యి నోటు తీసి ఇస్తాడు.
రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలంటూ జయప్రకాష్ రెడ్డి దీవిస్తే.. "రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు, దేశానికే ఉంటాడు" అంటూ ఆ కూతురు కాన్ఫిడెంట్ గా చెప్పడం, దానికి జయప్రకాష్ రెడ్డి "వావ్ వాట్ ఏన్ ఇంటెలిజెంట్ గర్ల్" అని పొగడటం ఈ సీన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో ఉండే పంచ్ టైమింగ్ ఈ సీన్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.
ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఎన్నేళ్లయినా ఈ తరహా కామెడీ సినిమాలకు ఆదరణ తగ్గదని నెటిజన్లు కామెంట్ల రూపంలో కొనియాడుతున్నారు. జయప్రకాష్ రెడ్డి, శకుంతల లాంటి మేటి నటులను మళ్లీ తెరపై చూసుకోవడం ఒక మంచి జ్ఞాపకమని పాతతరం సినీ ప్రియులు గుర్తుచేసుకుంటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి క్లీన్ అండ్ హిలేరియస్ కామెడీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Buridi Movie, Comedy Scenes, Jayaprakash Reddy, Telangana Shakuntala, EVV Satyanarayana





