Home

»

Exclusive Movie News

'ప్యారడైజ్' కథ ఇదే: షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఫైట్ మాస్టర్ నబాకాంత్.!

Sep 16, 2026 11:24AM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ప్యారడైజ్' ఇండస్ట్రీలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించి పబ్లిసిటీ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ గా వ్యవహరించిన నబాకాంత్ తెలుగువన్ (TeluguOne) ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను, యాక్షన్ ఎపిసోడ్ల వెనుక ఉన్న నిజాలను పంచుకున్నారు.

మణిపూర్ కు చెందిన నబాకాంత్ హైదరాబాద్ లోనే పెరిగారు. స్వతహాగా తెలుగు పట్ల ఎంతో మక్కువ పెంచుకున్న ఆయన ఫైట్ మాస్టర్ గా మారకముందు విజయ్ మాస్టర్, నందు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, రామ్-లక్ష్మణ్ మాస్టర్ల వద్ద సుదీర్ఘంగా 15 సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా శిక్షణ పొంది పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా ఫైట్ మాస్టర్ గా మారి గడిచిన 3 ఏళ్లలో పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. 

'పుష్ప 2' చిత్రంలో అల్లు అర్జున్ తో రప్ప రప్ప క్లైమాక్స్ ఫైట్, రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలోని నైట్ కుస్తీ ఫైట్, పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' లోని మూడు ప్రధాన ఫైట్లు, చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' ఇంట్రడక్షన్ ఫైట్లతో పాటు 'మిరాయి' సహా దాదాపు 6 ప్రధాన చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ చేసి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమా, టైగర్ ష్రాఫ్ ప్రాజెక్టుల నుండి పిలుపు వచ్చినా, డేట్స్ సరిపోకపోవడం వల్ల, అలాగే తెలుగు పరిశ్రమపై ఉన్న అభిమానంతో ప్రస్తుతం ఇక్కడే కొనసాగుతున్నారు.

నాని నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమాలో సెకండ్ హాఫ్ అత్యంత కీలకంగా ఉండబోతోందని నబాకాంత్ స్పష్టం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులని సీటు అంచున కూర్చోబెడతాయని చెప్పారు. ఈ రెండు ప్రధాన యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేయడానికి ఏకంగా 25 రోజుల పాటు శ్రమించారు. ఈ 25 రోజుల్లో నానితో పాటు మిగతా ముఖ్య నటీనటులు కూడా పాల్గొన్నారు. 

సినిమా కథాంశం గురించి చెబుతూ, ఇది ఒక అమ్మ-కొడుకు మధ్య ఉండే అత్యంత ఉద్వేగభరితమైన ఎమోషన్ అని, ఒక జాతికి సంబంధించిన కథ అని వెల్లడించారు. కథలో మోహన్ బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలిపారు.

ఈ సినిమాలో నాని పడిన కష్టం వర్ణనాతీతమని నబాకాంత్ కొనియాడారు. సెట్స్‌పై నాని ఒక్క ఫ్రేమ్‌లో కూడా డూప్‌ను వాడలేదని, అన్ని రిస్కీ స్టంట్స్ ఆయనే స్వయంగా చేశారని స్పష్టం చేశారు. షాట్ ఓకే అయ్యేంతవరకు ఎన్ని గాయాలైనా లెక్కచేయకుండా కష్టపడే మనస్తత్వం నానిదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ సినిమాలో జడల గెటప్‌తో ఫైట్స్ చేయడం నానికి చాలా ఇబ్బందికరంగా మారిందని, షాట్ మూవ్‌మెంట్ సమయంలో ఆ జడలు ముఖంపైకి వచ్చి రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చేదని చెప్పారు. 

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫైట్ మాస్టర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, రిహార్సల్స్ చూసిన వెంటనే ఆయన కంపోజిషన్‌పై పూర్తి నమ్మకం ఉంచారని అన్నారు. దసరా మిస్సయ్యాననే ఫీలింగ్ ప్యారడైజ్ సినిమాతో పూర్తిగా పోయిందని, ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌ను థియేటర్లలో అందిస్తుందని నబాకాంత్ ధీమా వ్యక్తం చేశారు.

 

 

 

[The Paradise Movie, Nani Paradise Movie, Fight Master Nabakanth, Interview, Natural Star Nani, Srikanth Odela, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com