Home

»

Exclusive Movie News

కర్మ వాళ్ళను వదిలిపెట్టదు: తెలంగాణ వచ్చాక నన్ను అసలు ఎవరూ గుర్తించలేదు.!

Sep 16, 2026 12:32PM

బుల్లితెరపై తనదైన గ్లామర్, ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యాంకర్ ఉదయభాను ఇప్పుడు నిర్మాతగా మారారు. ఆమె నిర్మించిన 'పంచనామ' వెబ్ సిరీస్‌ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రముఖ నటుడు భరత్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఉదయభాను 'తెలుగువన్ సినిమా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నిర్మాతగా మంచి మంచి ప్రాజెక్ట్ లు చేసి, ప్రేక్షకులను అలరించాలని తనకు ఎప్పటినుంచో ఉందని ఉదయభాను అన్నారు. 'పంచనామ' లాంటి సిరీస్ తో దానికి బలమైన పునాది పడటం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో తాను దాదాపు రెండు దశాబ్దాల క్రితం వెండితెరపై సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సుల్లో ఉండిపోవడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. ఏ విషయాన్నైనా నేరుగా మాట్లాడటం, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండటమే తన నైజమని ఉదయభాను స్పష్టం చేశారు. అందువల్లే చేతిలో మంచి కంటెంట్స్ ఉన్నా, నిర్మాతగా మారడానికి టైం పట్టిందని తెలిపారు. మధ్యలో పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతల వల్ల కూడా కాస్త ఆలస్యమైందని అన్నారు. అయితే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా అన్నట్టుగా 'పంచనామ'తో ఎంట్రీ ఇవ్వడం, దానికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. 

అయితే అప్పటికీ, ఇప్పటికీ ఇండస్ట్రీ చాలా మారిపోయిందని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మేనేజర్, పీఆర్ కల్చర్ నడస్తుందని.. కానీ తాను ఇప్పటికీ దానికి దూరంగానే ఉన్నానని చెప్పారు. ఒక రకంగా తన యాంకర్ కెరీర్ తెలంగాణకు ముందు తెలంగాణకు తర్వాత అన్నట్టుగా ఉందని తెలిపారు. తెలంగాణ రాకముందు చాలా మంచి షోలు చేశాను. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దగా కనిపించలేదు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా ఇక్కడమ్మాయి అని చెప్పి, నేను ఎప్పుడు కనిపించలేదు. ఆ బాధ మనసులో ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. తన భర్త సపోర్ట్, ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్లనే ఇప్పుడు నిర్మాతగా మారానని ఉదయభాను చెప్పుకొచ్చారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఎవరికైనా అన్యాయం చేయాలని చూస్తే కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.

 

 

 

[Anchor Udayabhanu, Udayabhanu Interview, Panchanama Web Series, Telugu Web Series 2026, ZEE5 Telugu Series, Actor Bharath, Medha Reddy, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com