Home

»

Exclusive Movie News

‘NBK 112’ స్టోరీ ఇదే.. పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ!

Jun 23, 2026 12:20PM

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) జోరు మీదున్నారు. వరుస ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలకు తెరతీస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 111’లో నటిస్తూనే, మరోవైపు తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK 112’కు ముహూర్తం ఖరారు చేసేశారు. డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. వెంకటాయపాలెంలోని ప్రముఖ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్ 25న ఈ వేడుక జరగనుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు పలువురు మంత్రులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

ఈ సినిమా కథాంశం గురించి వినిపిస్తున్న లీక్స్ ప్రకారం, ఇదొక పక్కా సోషల్ అండ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఒక భీకరమైన సామాజిక అరాచకం లేదా ‘ఈవిల్’పై ప్రజా నాయకుడు చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. అధికారం అనేది కేవలం పదవుల కోసమే కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే అని చాటిచెప్పే బలమైన సందేశం ఇందులో ఉంటుందట. సమాజం ఎదుర్కొంటున్న ఒక పెను భూతంపై సాగించే యుద్ధాన్ని కొరటాల శివ తనదైన స్ట్రైట్ నరేషన్, ఎమోషనల్ పంథాలో చూపించబోతున్నారని సమాచారం. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ‘టైలర్ మేడ్’ క్యారెక్టర్ ఇదని, సినిమాలో రెండు మూడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

మరో విశేషమేమిటంటే, బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని ప్రాజెక్టుతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్‌ను కూడా ప్యారలల్‌గా నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తొలుత బాలకృష్ణ లేని కీలక సన్నివేశాలను కొరటాల శివ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు ఎలాంటి గ్రాఫిక్స్ లేదా భారీ విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేకపోవడంతో, కేవలం కంటెంట్ మరియు ఎమోషన్ నమ్ముకుని శరవేగంగా షూటింగ్ పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ అసలు ప్లాన్. దర్శకుడు కొరటాల శివ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కసితో వర్క్ చేస్తున్నారు.

అగ్ర హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, బాలకృష్ణ ఒకేసారి రెండు సినిమాలను ప్యారలల్‌గా డ్రైవ్ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ జోరు చూస్తుంటే కొరటాల శివ సినిమా రన్ అవుతుండగానే, మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com