Home

»

Exclusive Movie News

కొన్ని వందల సినిమాలు చేసిన జయమాలిని ఇల్లు ఎలా ఉందో చూడండి!

Jun 23, 2026 12:43PM

ఒకప్పుడు టాలీవుడ్ వెండితెరపై తన గ్లామర్, డ్యాన్సులతో ఓ ఊపు ఊపేసిన సీనియర్ నటి, ఐటెం సాంగ్స్ క్వీన్ జయమాలిని (Jayamalini) గుర్తున్నారా?. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉంటే అక్కడ జయమాలిని ఉండాల్సిందే. శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ నటి, ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా జయమాలినికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చెన్నైలోని ఆమె నివాసానికి సంబంధించిన హోమ్ టూర్ విజువల్స్ ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ వైరల్ వీడియోలో జయమాలిని తన సొంత నివాసాన్ని తెలుగువన్ (TeluguOne) ప్రేక్షకులకు పరిచయం చేశారు. చెన్నై నగరంలో ఉన్న ఆమె ఇల్లు ఎంతో ప్రశాంతంగా, క్లాసీగా మరియు సంప్రదాయబద్ధంగా ముస్తాబై ఉంది. ఇంటి ఇంటీరియర్ డిజైన్, కలర్ సెలక్షన్ చూస్తే ఆమె అభిరుచి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రతి మూలలోనూ ఒక ప్రత్యేకత కనిపించేలా ఆమె తన ఇంటిని ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా గ్లామర్ ప్రపంచానికి దూరంగా, ఒక సాధారణ గృహిణిలా ఆమె తన ఇంటిని చక్కదిద్దుకున్న విధానం నెటిజన్లను ఫిదా చేస్తోంది.

గ్లామర్ క్వీన్‌గా ఒకప్పుడు థియేటర్లలో ఈలలు వేయించిన జయమాలిని, వ్యక్తిగత జీవితంలో ఎంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారో ఈ ఇల్లు చూస్తే స్పష్టమవుతుంది. కేవలం లగ్జరీ మాత్రమే కాకుండా, ఇల్లంతా ఒక రకమైన సానుకూల శక్తి, ప్రశాంతత ఉట్టిపడేలా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంటిముందు అమ్మగారి గుడి, ఇంటిలోపల పెద్ద పూజగది చూస్తుంటే ఆమెకు ఎంత దైవ భక్తో అర్థమవుతోంది.

టాలీవుడ్‌లో జయమాలిని, ఆమె సోదరి జ్యోతిలక్ష్మి సృష్టించిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో వీరిద్దరి సాంగ్స్ కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు కోకొల్లలు. అలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటి, ప్రస్తుతం చెన్నైలో తన భర్త, పిల్లలతో కలిసి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ హోమ్ టూర్ వీడియో చూసిన అభిమానులు పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. "మా చిన్నప్పటి గ్లామర్ క్వీన్ ఇల్లు చాలా బాగుంది", "జయమాలిని గారిని చూసి ఈ తరం వారు నేర్చుకోవాలి" అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com