Home

»

Exclusive Movie News

మళ్ళీ రేసులోకి బాలయ్య.. 'NBK 111' రిలీజ్ డేట్ లాక్.?

Jul 31, 2026 5:38PM

నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ రేసులోకి మళ్ళీ వేగంగా దూసుకొస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK 111' షూటింగ్, రిలీజ్ డేట్‌కి సంబంధించి ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ లేటెస్ట్ అప్‌డేట్ సంచలనం సృష్టిస్తోంది.

ఇటీవల బాలయ్యకి జరిగిన కాలి గాయం, దానికి సంబంధించిన సర్జరీ గురించి రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన అక్టోబర్ వరకు అసలు సెట్స్‌పైకి రాలేరని, షూటింగ్ చాలా ఆలస్యం అవుతుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.

బాలయ్య ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నారు. సర్జరీ సక్సెస్ ఫుల్‌గా పూర్తయి, ఆయన ఫిజియోథెరపీలో ఉన్నారు. నిలబడి అందరితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఆగస్టు నెల మొత్తం రెస్ట్ తీసుకున్నా, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఆయన పక్కాగా సెట్స్ పైకి అడుగుపెట్టబోతున్నారు. అసలు అక్టోబర్ వరకు ఆగడం అనే మాట పూర్తిగా కల్పితం.

ఈ లోపు గోపీచంద్ మలినేని అండ్ టీమ్ కూడా.. బాలయ్య లేని ఇతర సీన్స్ అన్నీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. బాలయ్య సెట్స్‌కి రాగానే కేవలం నెల రోజుల్లో ఆయన పోర్షన్ కంప్లీట్ చేసి షూటింగ్ ప్యాకప్ చెప్పేలా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.

అయితే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. రిలీజ్ ఎప్పుడు?. ముందుగా ఈ చిత్రాన్ని దసరా బరిలో దించాలని అనుకున్నా, ప్రమోషన్స్‌కి తగినంత సమయం కావాలి కాబట్టి ఒత్తిడి తీసుకోకూడదని మేకర్స్ భావిస్తున్నారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ కాలిక్యులేషన్ నడుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ సినిమాను పూర్తి చేసి, అక్టోబర్ నుంచి కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే తదుపరి సినిమా వైపు బాలయ్య వెళ్లాల్సి ఉంది.

అందుకే ఈ NBK 111 చిత్రాన్ని డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా సోలోగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనేది మెజారిటీ ప్లాన్. లేదా జనవరి సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్‌ని వాడుకుని దించాలా అని కూడా లెక్కలు వేస్తున్నారు. డిసెంబర్ ఎండ్‌లో వస్తే క్రిస్మస్ తో పాటు సంక్రాంతి హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకి లభిస్తుంది. 

ఇక సినిమా విషయానికి వస్తే, సంజయ్ దత్ పవర్‌ఫుల్ గెటప్, రీసెంట్‌గా వచ్చిన యాక్షన్ టీజర్‌తో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయాయి. పక్కా విలేజ్ డ్రామాగా మొదలై బాంబే బ్యాక్‌డ్రాప్ వరకు సాగే ఈ భారీ మాస్ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా రేంజ్‌లో రచ్చ చేయడం పక్కాగా కనిపిస్తోంది.

 

 

NBK 111, Nandamuri Balakrishna, Gopichand Malineni

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com