Home

»

Exclusive Movie News

సినిమా పోతే గుండు కొట్టించుకుంటా.. డైరెక్టర్ సంచలన ప్రకటన.!

Jul 28, 2026 4:45PM

బుల్లితెరపై పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ నటుడు అదిరే అభి (అభినయ కృష్ణ).. దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు. త్వరలో తాను దర్శకత్వం వహించిన సరికొత్త చిత్రం 'కర్మాఖ్య'తో వెండితెరపై అలరించడానికి సిద్ధమయ్యారు. 

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. "సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా" అంటూ ఎవరూ ఊహించని రీతిలో ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ పై అభి స్పందించారు.

"ఈ స్టేట్‌మెంట్ ఏదో కావాలని పబ్లిసిటీ కోసం వాంటెడ్‌గా చెప్పింది కాదు. థియేటర్లకు వచ్చి నా సినిమా చూడటానికి మాకేంటి భరోసా అని ప్రశ్నించే ప్రేక్షకులకు నేను ఇస్తున్న ఒక బలమైన నమ్మకం" అని అభి స్పష్టం చేశారు. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూసిన తర్వాత, 'ఈ సినిమా బాలేదు' అనే టాక్ వస్తే తాను బహిరంగంగా గుండు కొట్టించుకుంటానని ఆయన అన్నారు. సినిమా కంటెంట్‌పై తనకు ఉన్న అపారమైన విశ్వాసమే తనతో ఈ మాట అనిపించిందని ఆయన వివరించారు.

"మా సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధిస్తుంది లేదా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది" లాంటి పెద్ద మాటలు మాట్లాడటం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని అభి అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ అతి విశ్వాసానికి పోనని, కేవలం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూడబోతున్నామనే భరోసా ఇవ్వడమే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కంటెంట్ సరిగ్గా కుదిరితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, ఒకవేళ తమ ప్రయత్నం నచ్చకపోతే ఆ బాధ్యతను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ ప్రకటన ద్వారా చాటిచెప్పారు.

ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ 'కామాఖ్య' కాగా, సెన్సార్ అభ్యంతరంతో 'కర్మాఖ్య'గా మారింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ జూలై 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది.

 

Karmakhya Movie, Adire Abhi, Interview, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com