
అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన సినిమాల్లో ‘నిర్ణయం’ ఒకటి. 1991లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా చిత్రంలోని “హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం” పాట తెలుగు సినిమా రొమాంటిక్ మెలోడీస్ లో ఒక ట్రెండ్ సెట్టర్.
90s నాటి యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ఐకానిక్ మెలోడీ సమగ్ర విశ్లేషణ మీకోసం:
పాట సాహిత్యం:
గణేశ్ పాత్రో అందించిన ఈ సాహిత్యంలో హీరో ఆకతాయితనం, ప్రేమలోని చిలిపి పట్టుదల, హీరోయిన్ ను ఆటపట్టించే ధోరణి ఎంతో సరదాగా, ఉత్సాహభరితంగా వర్ణించబడ్డాయి.
పల్లవి:
హలో గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని
భావం:
అసలు ప్రేమించడానికే ఈ జీవితం ఉందని, అలాంటిది ప్రేమిస్తున్నాని వెంటపడుతున్న మగాడిపై ఆ అమ్మాయిని అంత పౌరుషం ఎందుకని హీరో ప్రశ్నిస్తున్నాడు. ఎంతో అందమైన అమ్మాయిలు కూడా పొందలేని స్థాయిలో ఉన్నానని, అలాంటి నన్ను కాదంటోంది అని హీరో తన గురించి తాను గర్వంగా చెప్పుకుంటున్నాడు.
చరణం 1:
ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య కలిగినోడ్ని చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్నా నీకున్నా తాఖీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్
హలో గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం
భావం:
హీరో తానెంత అందగాడో (ఉంగరాల జుట్టు, ఎత్తైన విగ్రహం), చదువుకున్న విద్యావంతుడో, ఎంత మంచి నేపథ్యం ఉన్నవాడో చెప్తున్నాడు. అన్ని విషయాల్లో నీకంటే గొప్ప అని, నిన్ను నా కంటే ఎక్కువగా ప్రేమించే మొనగాడు లేడని అంటూనే.. అసలు ఇన్ని అర్హతలు ఉన్న నన్ను కాదు అనడానికి కారణమేంటి? అని హీరోయిన్ ను చాలా సరదాగా, చిలిపి పౌరుషంతో అడుగుతాడు.
చరణం 2:
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవు సాంగ్లు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కాం నహీ కియా
అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రెడీ
భావం:
చేసుకుంటే పెళ్లి నిన్నే చేసుకుంటాను, వేరొకరిని పెళ్లి చేసుకోనని ఒట్టు వేసుకుంటున్నాను.. కాబట్టి ఇక నా దగ్గర పంతాలు, పట్టుదలలు విడిచిపెట్టు అని హీరో కోరతాడు. అలాగే తమ పెళ్లి త్వరలోనే వైభవంగా జరుగుతుందని, ఇద్దరం అభిమన్యుడు-శశిరేఖలా అందమైన జంటలా ఉంటామని చెబుతాడు. మాయాబజార్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమన్యుడిగా కనిపించగా, సావిత్రి శశిరేఖగా అలరించారు. వారి వివాహానికి ముందు 'ఆహా నా పెళ్ళంట' అని సావిత్రి పడుకుంటారు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ.. కేవలం రెండు లైన్లలోనే మొత్తం అర్థం వచ్చేలా రాయడం రచయిత గొప్పతనం.
నటీనటుల హావభావాలు & విజువల్స్
అక్కినేని నాగార్జున: తన మార్క్ 'కూల్ & డాషింగ్' లుక్‌తో, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, సరదా భావాలతో యువతను కట్టిపడేసారు.
అమల: కథానాయకుడి అల్లరికి కోపగిస్తూనే, మనసులో ప్రేమను దాచుకునే సున్నితమైన చిలిపి హావభావాలతో పాట గ్లామర్ స్థాయిని పెంచారు.
గాయకులు & సంగీతం:
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను తనదైన ప్రత్యేక శైలిలో, ఊపుతో ఆలపించారు. ఆయన గొంతులోని ఉత్సాహం పాటకే ప్రధాన బలంగా నిలిచింది.
సంగీతం: క్లాసికల్, వెస్టర్న్ ను మిక్స్ చేస్తూ ఇళయరాజా అందించిన స్వరాలు శ్రోతలను వెంటనే కాలు కదిపేలా చేస్తాయి. బ్రాస్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్ బీట్స్‌తో రూపొందించిన ఈ ఆర్కెస్ట్రేషన్ నేటికీ ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
[Hello Guru Prema Kosame Song, Telugu Lyrics, Nirnayam Movie, Akkineni Nagarjuna, Amala Akkineni, Ilaiyaraaja, SP Balasubrahmanyam, Telugu Songs]




