వెండితెరపై మమ్ముట్టి ఖాకీ యూనిఫాం ధరించి కంభీరమైన గొంతుతో డైలాగ్ చెబితే ఎదురుగా ఉన్నది సామాన్యుడైనా, పవర్ ఉన్న పొలిటీషియన్ అయినా వణికిపోవాల్సిందే. పోలీస్ జులుం నశించాలి అంటూ నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి తీవ్ర ఆందోళన చేస్తున్న సమయంలో, ప్రజా రక్షణ కోసం, శాంతిభద్రతలను కాపాడటం కోసం కమిషనర్ రుద్రమ నాయుడుగా మమ్ముట్టి ప్రదర్శించిన రౌద్రం ప్రేక్షకుల చేత నీరాజనాలు పలికించింది. గొడవలు ముదురుతున్న తరుణంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఒక రాజకీయ నాయకుడి వల్ల అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, అక్కడికి చేరుకున్న కమిషనర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిస్థితి చేతులు దాటకుండా చూడాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారిగా ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి.
అయితే పదవీ కాంక్ష, రాజకీయ అహంకారంతో రగిలిపోయే ఆ అమాత్యుడు, పోలీస్ ఆఫీసర్‌ను తీవ్రంగా బెదిరిస్తూ తన సీటు పవర్ చూపిస్తానని విర్రవీగుతాడు. ఏడేళ్ల క్రితం విజయవాడలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనను గుర్తుచేస్తూ, ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి నాటి రాజకీయ నాయకుల కుట్రలే కారణమని రుద్రమ నాయుడు సూటిగా ప్రశ్నిస్తారు. ఒక తుపాకీ కాల్పుల వల్ల వందలాది మంది ప్రాణాలు పోవడం కంటే, తప్పు చేసిన నాయకుడే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెగేసి చెబుతారు. ఆకతాయిగా మాట్లాడి, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందుకు ఆ మంత్రి చేత నడిరోడ్డుపై ప్రజలందరి ముందూ మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ చెప్పించే దృశ్యం ప్రతి ఒక్కరినీ రోమాంచితం చేస్తుంది. ఒక నిజాయితీ గల అధికారి ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో నిలబడగలడో ఈ సన్నివేశం నిరూపిస్తుంది.
ఈ పరాభవంతో రగిలిపోయిన సదరు మినిస్టర్, క్యాబినెట్ మీటింగ్ పెట్టి కమిషనర్ రుద్రమ నాయుడిపై చర్యలు తీసుకోవాలని సీఎం మరియు డీజీపీపై విపరీతమైన ఒత్తిడి తెస్తారు. తన వెనుక 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ బెదిరింపులకు దిగుతారు. కమిషనర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తారు. తీరా కమిషనర్ ఉన్నతాధికారుల ముందుకు రాగానే, ఆ మంత్రి నోటికొచ్చినట్లు పేలుతూ నీ ఉద్యోగం తీయించి, రోడ్డుపై ముష్టి ఎత్తుకునేలా చేస్తానంటూ విర్రవీగుతాడు. కానీ, అస్సలు భయపడని రుద్రమ నాయుడు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తారు. "సిగ్గు ఎగ్గు లేని నీ చంచాగాళ్ల దగ్గర చూపించు నీ ప్రతాపం.. రుద్రమ నాయుడు దగ్గర కాదు! నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు" అంటూ ఇచ్చే వార్నింగ్ థియేటర్లలో ఈలలు వేయించింది.
అంతేకాకుండా, గండిపేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి చేసిన కామకలాపాలు, 16 ఏళ్ల మైనర్ బాలికపై సాగించిన అక్రమాల సీక్రెట్ వీడియో క్యాసెట్‌ను బయటకు తీసి మంత్రికి అసలు సినిమా చూపిస్తాడు. వరంగల్‌లో ఉన్న 100 ఎకరాల తోటను రాసిస్తేనే ఈ మాస్టర్ క్యాసెట్ ఇస్తానని రివర్స్ స్కెచ్ వేసి ఆ అవినీతి నాయకుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేస్తాడు. ఆ బ్లాక్‌మెయిల్ ఫలితంగా, మరుసటి నిమిషంలోనే ఆ మంత్రి పరుగుపరుగున సీఎం వద్దకు వెళ్ళి, తాను కమిషనర్‌పై ఇచ్చిన సస్పెన్షన్ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నానని భయంతో వణికిపోతూ చెబుతాడు. పవర్ ఉన్న నాయకుల పీచమణచి, తన పవర్ ఏంటో చూపించిన మమ్మూట్టి పవర్‌ఫుల్ పోలీస్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ సినీ ప్రియులను అద్భుతంగా అలరిస్తూనే ఉంది. ఇలాంటి పవర్‌ఫుల్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
[Mammootty police performance, Rudrama Naidu IPS scene, Mammootty powerful dialogues, TeluguOne movie updates, Tollywood mass police scenes, Mammootty political mass scenes]




