Home

»

Exclusive Movie News

ప‌ర్‌ఫెక్ట్ ఫిజిక్ కోసం టాలీవుడ్ హీరోలు ఏం చేస్తున్నారంటే..?

Sep 4, 2026 3:24PM

ఒక‌ప్పుడు సినిమా హీరో అంటే అందం, అభిన‌యం ఉంటే స‌రిపోయేది. మారుతున్న కాలాన్ని బ‌ట్టి ప్రేక్ష‌కుల అభిరుచుల్లో మార్పులు వ‌చ్చాయి. అలాగే హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంపిక చేసుకునే క‌థ‌ల్లో కూడా చాలా కొత్త‌ద‌నం ఉండేలా చూసుకుంటున్నారు. సినిమాలో హీరో క్యారెక్ట‌ర్‌కి అనుగుణంగా వారి ఫిజిక్‌లో కూడా ఎంతో మార్పు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ముఖ్యంగా 2000వ సంవ‌త్స‌రం త‌ర్వాతి నుంచి ఈ ట్రెండ్ కొన‌సాగుతోంది. సినిమా, సినిమాకి హీరోలు తమ గెట‌ప్‌ని మార్చుకోవాల్సిన అవ‌స‌రం బాగా పెరిగింది. 

సినిమా కోసం, అందులోని త‌మ క్యారెక్ట‌ర్ కోసం ఎంత‌టి రిస్క్ అయినా తీసుకొని త‌మ ఫిజిక్‌ని మార్చుకుంటున్నారు హీరోలు. అలా ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది హీరోలు ఊహ‌కంద‌ని విధంగా మారుతూ వ‌స్తున్నారు. సినిమా కోసం హీరోల ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ అనేది త‌ప్ప‌నిస‌రిగా మారింది. అలా త‌మ శ‌రీరాకృతిని మార్చుకున్న టాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.

ప్రభాస్ 

‘బాహుబ‌లి’ చిత్రంలోని అమరేంద్ర బాహుబలి, శివుడు పాత్రల కోసం సాధారణ బరువు నుండి ఏకంగా 100 కేజీల వరకు పెరిగారు ప్ర‌భాస్‌. రాజమౌళి విజన్‌కు తగ్గట్టుగా రోజుకు దాదాపు 40 గుడ్ల తెల్లసొనలు, కేజీ చికెన్, నట్స్ రూపంలో 4,000 కేల‌రీ డైట్ తీసుకున్నారు. బాడీ బిల్డింగ్ నిపుణుల సమక్షంలో రోజుకు 5 గంటల పాటు వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ 

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘టెంప‌ర్’ చిత్రంలోని ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ ద‌యా పాత్ర కోసం ఎన్టీఆర్ త‌న లుక్‌ని పూర్తిగా మార్చుకున్నారు. అప్ప‌టివ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన ఎన్టీఆర్ ఈ సినిమా స‌మ‌యానికి స్లిమ్‌గా మారారు. సెలబ్రిటీ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ పాటిస్తూ, కేవలం హై-ప్రోటీన్ ఫుడ్స్ మాత్రమే తిన్నారు. నెలకు దాదాపు 10-12 కేజీల కొవ్వును కరిగించి ష్రెడెడ్ ఫిజిక్ సాధించారు.

రామ్‌చరణ్ 
'ధృవ' సినిమాలో ఐపిఎస్ ఆఫీసర్ తరహా లీన్ అండ్ మస్క్యులర్ కటౌట్ కోసం రామ్‌చ‌ర‌ణ్ క‌ఠోర సాధ‌న చేశారు. రా డైట్‌, క్యాల‌రీ లోటు విధానాన్ని అనుసరించారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కార్డియో, సాయంత్రం వేళల్లో కఠినమైన వెయిట్ ట్రైనింగ్ ద్వారా 8% లోపే బాడీ ఫ్యాట్ సాధించి సిక్స్ ప్యాక్ రూపాన్ని తీసుకొచ్చారు.

రానా దగ్గుబాటి 

‘బాహుబ‌లి’ చిత్రంలోని భ‌ల్లాలదేవుడు క్యారెక్ట‌ర్ కోసం 95 కేజీల లీన్ అండ్ ఫిట్ బాడీ, పార్ట్ 2 ఫ్లాష్‌బ్యాక్ కోసం ఏకంగా 110 కేజీల భారీ కండల శరీరంతో క‌నిపించారు ద‌గ్గుబాటి రానా. ప్రతి 2 గంటలకొకసారి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు నిండిన ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ కార్డియో,  హెవీ వెయిట్ లిఫ్టింగ్ సాధన చేశారు. ఒకే సినిమా సీక్వెల్స్ కోసం రెండు రకాల శరీర ఆకృతులను మార్చడం ఈ కేటగిరీలోనే రికార్డు.

సుధీర్‌బాబు 

స్వ‌త‌హాగా క్రీడాకారుడైన సుధీర్‌బాబు ‘వి’ చిత్రం కోసం ప‌ర్‌ఫెక్ట్ బాడీని తీసుకొచ్చారు. పవర్‌ఫుల్ పీడీ ఆఫీసర్‌గా నటించడం కోసం ఎక్స్‌ట్రీమ్ లీన్ అథ్లెటిక్ బాడీని సాధించారు. కాలిస్టెనిక్స్, జిమ్నాస్టిక్స్, ఇంటెన్స్ జిమ్ వర్కౌట్లతో తన కండరాలను తీర్చిదిద్దారు. టాలీవుడ్‌లో ప‌ర్‌ఫెక్ట్‌, కట్ ఫిజిక్ సాధించిన నటుల్లో సుధీర్‌బాబు ఒకరిగా నిలిచారు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com