
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాపై టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో ‘బలగం’ ఫేమ్ నటుడు సంజయ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘తెలుగువన్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంజయ్ ‘పెద్ది’ ప్రాజెక్ట్‌లోకి తాను ఎలా వచ్చారో, ఆ సినిమా కోసం పడ్డ కష్టాలేంటో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (Balagam Sanjay Interview)
నిజానికి ‘పెద్ది’ సినిమాలో సంజయ్‌కు దాదాపు ఏడాదిన్నర క్రితమే ఆఫర్ వచ్చింది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కాంబినేషన్‌లో ఉండే ఒక మంచి క్యారెక్టర్ కోసం మేకర్స్ మొదట సంజయ్‌ను సంప్రదించారు. లుక్ టెస్ట్ కూడా పూర్తయిన తర్వాత.. ఆ పాత్ర కంటే హీరోతో వన్-టు-వన్ ఉండేలా, ఇంకాస్త పవర్‌ఫుల్ ఆపోజిట్ రోల్ అయితే బాగుంటుందని సంజయ్ భావించారు. దీంతో ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించి, మరో మంచి క్యారెక్టర్ ఉంటే చూడమని దర్శకుడిని రిక్వెస్ట్ చేసి వెనక్కి తగ్గారు.
మొదట వచ్చిన ఆఫర్‌ను వదులుకున్నాక, సినిమా షూటింగ్ మొదలై సాంగ్స్ విడుదలవుతున్న సమయంలో తాను ఒక పెద్ద సినిమాను మిస్ అయ్యాననే రిగ్రెట్ సంజయ్‌లో మొదలైంది. "ఏదో పెద్ద ప్రాజెక్ట్ మిస్ అవుతున్నా" అని తన మేనేజర్‌తో రోజు చెబుతూ, మేకర్స్‌తో టచ్‌లోనే ఉన్నారు. కరెక్ట్ టైమ్‌లో సినిమాలో మరో పవర్‌ఫుల్ రోల్ కోసం వెతుకుతున్నప్పుడు సంజయ్‌కు మళ్లీ పిలుపు వచ్చింది. డైరెక్టర్ బుచ్చిబాబు సంజయ్‌ను చూడగానే ఆ పాత్రకు పక్కాగా సెట్ అవుతాడని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అయితే ఆ పాత్రకు మంచి ఫిజిక్ అవసరం పడింది. షూటింగ్ ప్రారంభం కావడానికి కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో సంజయ్ కఠినమైన వర్కవుట్స్ చేయాల్సి వచ్చింది. ఆ 10 రోజుల పాటు ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి, ఉదయం 4:30 నుండి 7:30 వరకు నిర్విరామంగా జిమ్‌లో చెమటోడ్చారు. బాడీపై అంత ప్రెజర్ పెట్టి కష్టపడటం వల్లే స్క్రీన్ మీద ఆ లుక్ పర్ఫెక్ట్‌గా తీసుకురాగలిగానని సంజయ్ చెప్పారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన సంజయ్ చేయబోయే ఈ వన్-టు-వన్ సీన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదట వద్దనుకున్నా.. చివరకు అంతకంటే పవర్‌ఫుల్ రోల్‌తో ‘పెద్ది’ లైనప్‌లోకి రావడం తన అదృష్టమని సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.
పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు మార్క్ టేకింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ పవర్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






