Home

»

Exclusive Movie News

అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్.. మహేష్ బాబు డైరెక్టర్‌తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.!

Aug 1, 2026 11:41AM

అక్కినేని అఖిల్ తన కెరీర్‌ను సరికొత్తగా ప్లాన్ చేసుకుంటూ పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, భారీ వసూళ్లను రాబట్టడంతో అఖిల్ మాస్ ఇమేజ్‌తో పాటు కెరీర్ పరంగా ఒక బలమైన ట్రాక్‌లోకి వచ్చారు. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో, తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలకు దూరంగా ఉంటూ.. విభిన్నమైన, సెన్సిబుల్ కథలతో ప్రేక్షకు ముందుకు రావాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కాంపౌండ్‌లోకి ప్రముఖ దర్శకుడు పరశురామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో గీత గోవిందం లాంటి రూ.100 కోట్ల క్లబ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను, మహేష్ బాబుతో సర్కారు వారి పాట వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పరశురామ్.. క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ డీల్ చేయడంలో మంచి పట్టున్న దర్శకుడు. ప్రస్తుతం ఒక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పరశురామ్.. అఖిల్‌కు ఉన్న ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్‌కు తగినట్లుగా ఒక సరికొత్త వైవిధ్యమైన కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

'లెనిన్' ఇచ్చిన మాస్ ఊపు తర్వాత, అఖిల్‌కు ఒక కంప్లీట్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ వేరియేషన్ ఎంతో అవసరం. గతంలో నారా రోహిత్‌తో 'సోలో', రవితేజతో 'ఆంజనేయులు', విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన పరశురామ్, అఖిల్‌ను ఒక సరికొత్త డైమెన్షన్‌లో చూపించే అవకాశం ఉంది.

అక్కినేని కుటుంబంలో నాగార్జున 'శివ', 'గీతాంజలి' వంటి సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో తన కెరీర్‌ను నిర్మించుకోగా, నాగచైతన్య 'ఏం మాయ చేసావే', 'తండేల్' వంటి వైవిధ్యమైన సినిమాలతో ఫామ్‌లోకి వచ్చారు. అదే బాటలో అఖిల్ కూడా గ్లోబల్ కంటెంట్, ఓటీటీల వల్ల మారిన ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్టులను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. 

కేవలం పరశురామ్ మాత్రమే కాకుండా, ఇటీవల సరికొత్త హిట్లు అందిస్తున్న యువ దర్శకులపై కూడా అఖిల్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర దర్శకుడు రవి నంబూరి లాంటి నవతరం టాలెంట్స్‌ను ప్రోత్సహిస్తూ, సరికొత్త ప్లానింగ్‌తో తన కెరీర్‌ను సుస్థిరం చేసుకునే దిశగా అక్కినేని హీరో వేగంగా అడుగులు వేస్తున్నారు.

 

 

Akhil Akkineni, Lenin Movie, Director Parasuram

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com