
టాలీవుడ్ లో సునీల్ మార్క్ కామెడీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలతో నవ్వించిన సునీల్.. శ్రీహరి హీరోగా నటించిన 'సింహాచలం' సినిమాలో.. బిల్డప్ బాబాయ్ తరహా పాత్రలో సునీల్ పండించిన హాస్యం ఇప్పటికీ కడుపుబ్బా నవ్విస్తుంది.
సివిల్ డ్రెస్ లో ఉన్న డీసీపీ సింహాచలం ముందు.. ఫేక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ లో ఉన్న సునీల్ తెగ బిల్డప్ ఇస్తాడు. తాను డీసీపీ సింహాచలం మనిషేనని చెప్పి హడావుడి చేస్తాడు. తీరా తన ఎదురుగా ఉన్న వ్యక్తే.. రియల్ డీసీపీ సింహాచలం అని తెలిసి.. కాళ్ళ బేరానికి వస్తాడు.
పోలీస్ స్టేషన్ లో సింహాచలం ముందు.. సునీల్ నటన మామూలుగా ఉండదు. తాను ఎంతో పేద విద్యార్థినని, పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే, పేపర్లలో ఫోటో కూడా వచ్చింది అంటూ కట్టు కథలు చెబుతాడు. రేపు పొద్దున తనకు ఎగ్జామ్ ఉందని చెబుతూ.. వదిలేయని సింహాచలాన్ని వేడుకుంటాడు. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అని డిసిపి అడిగితే, "రాస్తే గ్యారెంటీగా వస్తుంది సార్, మీ పేరు నిలబెడతాను" అంటూ సునీల్ ఇచ్చే అమాయకపు ఎక్స్‌ప్రెషన్లు నవ్వుల పూయిస్తాయి. అమాయకంగా ఉన్నాడని డిసిపి జాలిపడి వదిలేస్తాడు.
అయితే సునీల్ మాత్రం.. స్టేషన్ నుంచి బయటపడగానే తన బిల్డప్ మొదలుపెడతాడు. "ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, అధికార పక్షం కావాలా, ప్రతిపక్షం కావాలా, ఫ్యూచర్ లీడర్లు కావాలా" అంటూ భారీ డైలాగులతో హంగామా చేస్తాడు. అంతమంది స్టేషన్‌కు వస్తే జాగ సరిపోదని భయపడే ఆ డిసిపి సింహాచలం తనని వదిలేశాడని కవర్ చేసుకుంటాడు. వెనుకనే సింహాచలం నిలబడి వింటున్నారని తెలియక సునీల్ కొట్టే బిల్డప్ తో సీన్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటుంది. దీంతో మళ్ళీ సునీల్ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తాడు.
అయితే పోలీసులు మాత్రం.. అతనికి బుద్ధి రావాలని, ఎలాంటి కేసు పెట్టకుండానే, స్టేషన్ లో అన్ని పనులు చేయించుకుంటారు. అప్పుడు కూడా సునీల్ వేసే డైలాగ్ లు మరింత నవ్విస్తాయి. "అరెస్ట్ చేసిన 24 గంటల లోపల కోర్టుకు సబ్మిట్ చేయాలని చట్టం ఉందనే విషయం తెలుసా" అని సునీల్ నిలదీస్తే, "నీ మీద కేసే పెట్టలేదురా, ఇంకా కోర్టులో ఏం సబ్మిట్ చేస్తాం" అని పోలీసులు రివర్స్ షాక్ ఇస్తారు. కేసు లేకుండా లోపల వేస్తే నీ ఉద్యోగమే పోతుందని సునీల్ ఇచ్చే హెచ్చరికలు, దానికి సాక్ష్యం లేదంటూ పోలీసులు ఇచ్చే కౌంటర్లు కామెడీని పీక్స్‌కి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ "బిల్డప్ బాబాయ్ 2.0" కామెడీ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
Sunil Comedy, Buildup Babai, Simhachalam Movie, Srihari






