Home

»

Exclusive Movie News

'అబ్బాయిగారు' శోభనం కామెడీ.. ఆషాడ మాసం సీక్రెట్ చెప్పిన మీనా!

Jun 9, 2026 12:16PM

టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh), అందాల హీరోయిన్ మీనా (Meena) కాంబినేషన్ అనగానే మనకు ఎన్నో అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్లాసిక్ వింటేజ్ కామెడీ మూవీ 'అబ్బాయిగారు' (Abbayigaru). ఈ చిత్రంలోని శోభనం సీన్లు, రోమాంటిక్ కామెడీ ట్రాక్ ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉంటాయి. తింగరి మొగుడు, తిప్పులాడి భార్యగా వీరిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ, టైమింగ్ టాలీవుడ్ హిస్టరీలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అమాయకత్వంతో కూడిన భర్త పాత్రలో వెంకటేష్, చురుకైన మరియు అల్లరి భార్యగా మీనా అద్భుతమైన నటనను కనబరిచారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే శోభనపు రాత్రి కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తమ్ముడు(శ్రీకాంత్) శోభనం కోసం వెంకటేష్ ఏర్పాట్లు చేయగా.. మీ తమ్ముడికి శోభనం జరిగితే, తల్లికి గండం అంటూ మీనా నాటకం ఆడి, ఆ శోభనాన్ని ఆపేయడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వెంకటేష్ అసిస్టెంట్ గా బ్రహ్మానందం వేసే సెటైర్లు నవ్వులు పూయిస్తాయి.

ఆ తర్వాత వచ్చే ఆషాడ మాసం సీన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. వెంకటేష్-మీనా శోభనం జరగకుండా ఉండటం కోసం ఆషాడ మాసాన్ని సాకుగా చూపుతుంది అత్త. ఆషాడ మాసం పేరు చెప్పి అత్తగారు శోభనం జరగకుండా చేయాలని చూసినా, మీనా మాత్రం తనదైన శైలిలోవెంకటేష్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆషాడంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదో సైంటిఫిక్ రీజన్ చెప్తూ మీనా చేసే అల్లరి, దానికి వెంకటేష్ ఇచ్చే కౌంటర్లు హైలైట్‌గా నిలుస్తాయి. ఆషాడంలో కలిస్తే పిల్లలు చైత్ర మాసంలో పుడతారని, ఆ వేసవి కాలం వేడి వల్ల తల్లికి, పుట్టే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయనే పెద్దల మాటను మీనా వివరించే తీరు ఎంతో సహజంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు సప్లై చేసే కుటుంబ నియంత్రణ మందు గురించి మీనా మాట్లాడటం, అది చూసి వెంకటేష్ ఆశ్చర్యపోవడం వంటి సీన్లు సిట్యుయేషనల్ కామెడీకి పరాకాష్టగా నిలుస్తాయి.

కథలో మరో ప్రధానమైన కామెడీ ట్రాక్ మేనమామ కోట శ్రీనివాసరావు చేసే మోసాలు, అక్రమ ఆస్తుల చుట్టూ తిరుగుతుంది. లక్షల రూపాయల వ్యాపార నష్టాలను లాభాలుగా మార్చి గుమస్తా చేత తప్పుడు లెక్కలు చెప్పించే మేనమామ నాటకాలను మీనా తన తెలివితేటలతో బట్టబయలు చేస్తుంది. ఈ అక్రమ సంపాదననంతా మేనమామ తన పరుపు కింద దాచిపెట్టగా, ఆ పరుపులో భయంకరమైన ‘కట్టల పాము’ దూరిందని డ్రామా ఆడుతుంది. పాము భయంతో పరుపు దులపగా, అందులోంచి నోట్ల కట్టల బయటపడటంతో మేనమామ గుట్టు రట్టవుతుంది. 

'అబ్బాయిగారు' సినిమాలోని ఈ అల్టిమేట్ కామెడీ సీన్స్ ను తాజాగా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 17 నిమిషాల నిడివి గల ఈ క్లాసిక్ కామెడీ ప్యాక్డ్ సీన్లు 4K రిజల్యూషన్‌లో అందుబాటులోకి రావడం విశేషం. ఈ కామెడీ సీన్లు పాత జ్ఞాపకాలను గుర్తుచేయడమే కాకుండా, ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com