Home

»

Exclusive Movie News

Dragon: ‘డ్రాగన్’ స్టోరీ లీక్.. ఎన్టీఆర్ రెండు గెటప్స్.. అసలు నిజం ఇదే!

Jun 9, 2026 12:46PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon). ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక సంచలన లీక్డ్ స్టోరీ మరియు షూటింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ ఇక్కడ ముగియగా, నెక్స్ట్ మంత్ అంటే రాబోయే నెలలో తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంక వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సుమారు 1 సంవత్సరం పాటు లాంగ్ ప్రొడక్షన్ టైమ్ తీసుకోనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.

ఈ చిత్రంలో అందరినీ షాక్‌కు గురిచేస్తున్న ప్రధానాంశం ఎన్టీఆర్ సరికొత్త గెటప్. బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో 'లూగర్'గా ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంది. అయితే సినిమాలో ఎన్టీఆర్ మరొక పవర్‌ఫుల్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారనే వార్త క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది. అయితే ఇక్కడ ఇద్దరు ఎన్టీఆర్‌లు ఉంటారా లేక ఒకే ఎన్టీఆర్ రెండు వేర్వేరు గెటప్స్‌లో కనిపిస్తారా అనే సందిగ్ధత నెలకుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలనిజం షేడ్స్ ఉన్న మాఫియా డాన్ తరహా పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పటికే ప్రశాంత్ నీల్ చెప్పడంతో.. ఇప్పుడు ఆ సెకండ్ గెటప్ చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయింది.

అందరూ ఇదొక కేవలం ఇంటర్నేషనల్ మాఫియా లేదా డ్రగ్ కారిడార్ బ్యాక్‌డ్రాప్ అనుకుంటున్నారు కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక పక్కా పేట్రియాటిక్ (దేశభక్తి) మూవీ అని ప్రశాంత్ నీల్ చెప్పారు. థాయిలాండ్, లావోస్, మయన్మార్ దేశాల సరిహద్దులు కలిసే ప్రదేశం గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పడగొట్టే యాక్షన్ వార్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇండియాలోని ఈస్టర్న్ స్టేట్స్ సరిహద్దులలో జరిగే ఘర్షణలను డ్రగ్స్ వ్యతిరేక యుద్ధంతో లింక్ చేస్తూ 'డ్రగ్ ఫ్రీ ఇండియా' అనే బలమైన సోషల్ మెసేజ్ మరియు దేశభక్తి కాన్సెప్ట్‌తో ప్రశాంత్ నీల్ ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను రాసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథానాయకుడు చేసే ప్రతి యాక్షన్ వెనుక దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగడం వల్ల ఇది నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ రైడ్‌గా మారబోతుంది.

భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో యానిమల్ మరియు దురంధర్ వంటి వైలెంట్ యాక్షన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. వాటన్నింటినీ మించిన స్థాయిలో 4 నుండి 5 దేశాల సైన్యాలు, అంతర్జాతీయ మాఫియా గ్యాంగుల మధ్య జరిగే యుద్దాన్ని ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా భయం, రోమాంచితమైన అనుభూతిని కలిగించేలా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ కెరీర్‌లో చేయని సరికొత్త గ్లోబల్ క్యాన్వాస్ మరియు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కంటెంట్‌ను ఎన్టీఆర్ 'డ్రాగన్' లో చూడబోతున్నాం. వచ్చే ఏడాది జూన్ 11 థియేట్రికల్ రిలీజ్ వరకు ప్రేక్షకులను నిరంతరం సస్పెన్స్‌తో హుక్ చేసి ఉంచేలా మేకర్స్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com