సింగపూర్ లో ప్రముఖ సింగర్ మృతి.. స్కూబా డైవింగ్ లో ఏం జరిగింది!
on Sep 19, 2025

కొంత మంది గాయకులు సంగీత ప్రపంచంలో తమకంటుఒక బ్రాండ్ ని సృష్టించుకుంటారు. అటువంటి బ్రాండ్ ని సృష్టించుకున్న గాయకుడు 'జుబీన్ గార్గ్'(Zubeen Garg). జుబిన్ ప్రధానంగా 'అస్సామీ' భాషకి చెందిన గాయకుడైనా, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, సంస్కృతంతో సహా దాదాపు 60 భాషలలో పాటలు పాడాడు. తన అద్భుతమైన గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
జుబీన్ కొంతకాలం క్రితం 'ఈశాన్య రాష్త్ర ఉత్సవానికి సంబంధించిన ఫెస్టివల్ లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్ళాడు. అక్కడ 'స్కూబా' డైవింగ్(Scuba Diving)చేసే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు.రీసెంట్ గా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జుబిన్ అభిమానులు షాక్ లో ఉన్నారు. త్వరలోనే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ అంతలోనే ఆయన చనిపోవడం దారుణమని తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.
2006 లో వచ్చిన గ్యాంగ్ స్టర్ సినిమాలోని 'యా అలీ' సాంగ్ తో జుబిన్ బాగా ఫేమస్ అయ్యాడు. రచయిత, నటుడుగా కూడా తన సత్తా చాటిన జుబిన్ నవంబర్ 18, 1972న మేఘాలయలో జన్మించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



