రోజాకు రెండోవైపు..
on Oct 31, 2016
ప్రముఖ సినీనటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ మహిళ ప్రాణాలను ఆమె కాపాడారు. రీసెంట్గా ఒక కార్యక్రమం నిమిత్తం రోజా చిత్తూరు జిల్లా పాకాల మండలం వైపు తన కారులో వెళుతున్నారు. అదే సమయంలో పాకాల సమీపంలోని నేండ్రగుంట వద్ద సింధు అనే మహిళ ప్రమాదవశాత్తూ స్కూటీపై నుంచి క్రిందకు పడిపోయారు. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన రోజా ఆమెను తన కారులో దగ్గరలో ఉన్న ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం సింధుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. రోజా సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సింధుకి ప్రాణాపాయం తప్పింది. మామూలుగా సినీ రంగంలో ఉన్నవారికి సామాజిక బాధ్యత తక్కువ ఉంటుందని కొందరి భావన. ఆడియో రిలీజ్లు, పార్టీలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కే వారు ప్రాధాన్యతనిస్తారనే తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ అల్రెడీ పాలిటిక్స్‌లో ఉన్న రోజా అది తప్పని నిరూపించింది.