Home

»

Latest News

రజనీని మార్చిన వ్యక్తి ఆయనే..

Oct 31, 2016 5:28PM

సూపర్‌స్టార్ రజనీకాంత్..కృషి, పట్టుదల, శ్రమ ఉంటే సామాన్యులు సైతం అసామాన్యులుగా మారొచ్చని నిరూపించిన వ్యక్తి. బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయం.  నటుడిగానే కాకుండా మానవత్వం కలిగిన మనిషిగా నిరాడంబర జీవితాన్ని గడిపే రజినీ మరేందరికో స్పూర్తి.  అయితే రజనీ ఇప్పుడిలా ఉన్నాడు కానీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో మద్యపానం, ధూమపానం లేకుండా అస్సలు బండి నడిచేది కాదట. అలాంటి రజినీని ఇలా మార్చిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయన ఎవరో కాదు తమిళ సీనియర్ నటుడు, ప్రముఖ హీరోలు సూర్య, కార్తీల తండ్రి శివకుమార్. ఆయన 75వ పుట్టినరోజు సందర్శంగా రజనీకాంత్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ రాశారు.

నా కెరీర్ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను. అప్పట్లో నాకు మద్యం, సిగిరెట్ తాగే అలవాటు ఉండేదన్నారు. ఆ దశలో శివకుమార్ ఆ అలవాట్లను వదులుకొమ్మని సూచించారని..మంచి నటుడిగా ఎదగాలంటే ఆ అలవాట్లను వదులుకోవాలని శివకుమార్ చెప్పారన్నారు. ఆయన సూచనలను పాటించి తను ధూమపానానికి, మధ్యపానానికి దూరం అయ్యానని రజనీ ఆ లేఖలో పేర్కొన్నారు. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శివకుమార్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com