
యూట్యూబర్ రమా నందన పేరు గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తోంది. యూకే జాబ్స్, వీసా స్పాన్సర్‌షిప్‌కి సంబంధించిన కేసులో సెప్టెంబర్ 7న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు పెద్దగా స్పందించని రమా నందన.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్‌తో మరోసారి చర్చలోకి వచ్చారు.
“నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. పబ్లిసిటీ కోసం కాదు” అంటూ తనపై వస్తున్న ప్రచారానికి రమా నందన సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 7న తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని చెబుతూ.. తాను స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు వచ్చానని పేర్కొన్నారు.

తమ కుటుంబానికి సంబంధం లేని వ్యవహారంలోకి తమ పేర్లను, పరువును కావాలనే లాగుతున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజం కోసం పోరాడతానని స్పష్టం చేశారు.
“చేయని తప్పుకు తలదించను.. కుంగిపోతానేమో కానీ ఓడిపోను” అంటూ రమా నందన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది రాబోయే రోజుల్లో బయటకు వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఆటోలో రజనీకాంత్.. సూపర్‌స్టార్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా!
[Youtuber Rama Nandana, Rama Nandana Viral Post, Rama Nandana Insta Post, Rama Nandana Instagram, Nandus World Instagram, Rama Nandana, Nanuds World, Telugu Film News]





