Home

»

Latest News

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ: మహేష్ బాబు మెచ్చిన మూవీ.!

Sep 30, 2026 7:14PM

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్‌గా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాను ప్రత్యేకంగా వీక్షించి, ఆ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. 

మహేష్ బాబు సాధారణంగా ఒక సినిమా నచ్చితే మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అలాంటిది తన 'వారణాసి' దర్శకుడు రాజమౌళి సమర్పణలో వస్తున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' చూడకుండా ఉంటారా?. చూశారు.. సోషల్ మీడియా వేదికగా రివ్యూ కూడా ఇచ్చేశారు.

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా చూసిన తర్వాత మహేష్ పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. "ఇదొక బ్యూటిఫుల్, కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ అండ్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్" అంటూ సినిమా ఎంత హార్ట్ టచింగ్‌గా ఉందో ఆయన వివరించారు.

ఇక ఈ సినిమాలో నటించిన యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటనపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. "ఫహాద్ సర్.. మీరు అద్భుతమైన నటుడు. ప్రతీ సినిమాలోనూ మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే తీరు, మీ నటన నాలాంటి వారికి ఎంతో ఇన్‌స్పిరేషన్" అని కొనియాడారు. అంతేకాదు, ఈ సినిమాలో నటించిన పాప ఎస్సారా, ఫహాద్ కాంబినేషన్ తెరకు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టిందని, వాళ్లిద్దరూ క్యారెక్టర్లలో జీవించారని అన్నారు.

ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్న ఎస్.కార్తికేయను మహేష్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. "కార్తీ.. ఇన్నాళ్లకు నీ శ్రమ ఫలించింది, ప్రశాంతంగా శ్వాస తీసుకో. నువ్వు, శోభు కలిసి ఒక అద్భుతమైన సినిమాని అందించారు" అని ఆనందం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ శశాంక్ క్రియేట్ చేసిన ఈ వర్ల్డ్ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తుందని, అక్టోబర్ 2న థియేటర్లలో ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి మహేష్ నుంచి 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాకి పాజిటివ్ రివ్యూ వచ్చేసింది. 

ఇది కూడా చదవండి: ‘ధురంధర్ 2’కు 50 కట్స్.. టీవీలో రాబోతున్న వెర్షన్‌లో ఏముందంటే.?

 

 

 

[Mahesh Babu Review On Dont Trouble The Trouble, Don't Trouble The Trouble Movie, Don't Trouble The Trouble Review, Dont Trouble The Trouble, Mahesh Babu Twitter, Fahadh Faasil, SS Rajamouli, Telugu Film News, Tollywood Updates]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com