
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బయట కనిపిస్తే చాలు.. అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టేస్తారు. అలాంటి స్టార్ ఎలాంటి హంగామా లేకుండా ఆటోలో షూటింగ్ స్పాట్‌కు రావడం వైరల్‌గా మారింది.
రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. తాజాగా షూటింగ్ లొకేషన్‌కు రజనీకాంత్ ఆటోలో రావడంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆటో నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్.. అక్కడ గుమిగూడిన అభిమానులను చూసి చేతులు ఊపుతూ పలకరించారు. అంతేకాదు.. షూటింగ్ సెట్‌లోకి వెళ్లిన తర్వాత కూడా ఫ్యాన్స్ అరుపులు వినిపించడంతో మరోసారి బయటకు వచ్చి వారిని పలకరించారు. మారూన్ షర్ట్, పంచె కట్టులో కనిపించిన రజనీకాంత్‌ను చూసేందుకు చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులతో కలిసి అక్కడికి రావడం వీడియోల్లో కనిపించింది.
కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్‌కు చెందిన టర్మరిక్ మీడియా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రజనీకాంత్, అశ్వత్ మారిముత్తు కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే. సిమ్రన్, రాశీ ఖన్నా, యోగిబాబు నటిస్తున్న ఈ సినిమాలో.. రామ్ పోతినేని, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చందూ మొండేటి బాలీవుడ్ ఎంట్రీ.. ఇద్దరు స్టార్స్‌తో భారీ మైథలాజికల్ మూవీ.!
[Rajinikanth Auto, Dharman Movie, Dharman Shooting, Superstar Rajinikanth, Ashwath Marimuthu, Kamal Haasan, Anirudh Ravichander, Telugu Film News]






