విలువైన సమయాన్ని వృధా చేసుకుంటోన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్!
on Feb 19, 2023

ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే ఆదర్శకులకు ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది. పేరు గాంచిన నిర్మాణ సంస్థలు హీరోలు ఆయా దర్శకునితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఆ దర్శకులు మాత్రం ఏదో ఒక స్టార్ తో సినిమా చేయాలని మొండిపట్టుతో అలాగే ఉండిపోతారు. స్టార్ హీరోలు కూడా దర్శకులకు తాము చిత్రాలు చేస్తామని మాటిస్తారు. దాంతో వారి కోసం కథలను చెక్కుతూ ఏళ్లకు ఏళ్లు గడిపేస్తారు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా దానిని సద్వినియోగం చేసుకోకుండా ఏదో ఒక స్టాండ్ ను పట్టుకొని వేలాడి ఏళ్లకు ఏళ్లు వేస్ట్ చేసుకోవడం ఆదర్శకుల కెరీర్ కు ఇబ్బందిగా మారుతుంది ఉదాహరణకు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ని తీసుకుంటే ఈయనతో సినిమా చేస్తానని రామ్ చరణ్ మాట ఇచ్చారు.
దాంతో గౌతం ఏళ్లకు ఏళ్లు ఆయన కోసం ఎదురుచూశారు. చివరకు ఆర్ఆర్ఆర్ తర్వాత గౌతమ్ ఈ ప్రాజెక్టు చేయాలనుకున్నారు. కానీ గౌతం చిత్రంలో కూడా హీరో పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కావడంతో చరణ్ ఆగిపోయారు. వరుసగా రెండు చిత్రాలలో పోలీస్ పాత్రలు పోషించడం మంచిది కాదని తప్పుకున్నారు. దాంతో ఇంతకాలం చరణ్ కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృధా చేసుకున్న గౌతమ్ నిట్టూరుస్తూ విజయ్ దేవరకొండతో ఆచిత్రం చేస్తున్నారు. దాంతో గౌతమ్ ఇంతకాలం టైం వేస్ట్ చేసుకున్నట్టయింది. ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన దర్శకుడు బుచ్చిబాబు సాన. ఈయన ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ చిత్రంతో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈయన కోసం నాలుగైదు నిర్మాణ సంస్థలు ఆఫర్స్ చేశారు. కానీ బుచ్చిబాబు సానా మాత్రం తనకు ఎన్టీఆర్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడని మౌనంగా ఉండిపోయాడు.
కథను మెరుగులు దిద్దూతు ఉండిపోయారు. ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. కానీ ఇంతలో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఆలస్యమవుతుందని భావించారు. ఆ సినిమా పూర్తి అయ్యేదాకా బుచ్చి బాబును వేచి ఉండేలా చేసి చివరకు కొరటాల శివ తర్వాత తనకి ప్రశాంత్ నీల్ చిత్రం ఉందని చెప్పడంతో ఆ స్టోరీని రామ్ చరణ్‌కి షిప్ట్ చేసుకున్నారు. తర్వాత ప్రశాంత్ నీళ్లతో సినిమా ఉందని చెప్పడంతో బుచ్చిబాబు సాన రెండేళ్లకు పైగా టైమ్ ను వృధా చేసుకున్నారు. తాజాగా బుచ్చిబాబు రామ్ చరణ్‌తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
రాంచరణ్ ప్రస్తుతం ఆర్సీ 15 చిత్రం చేస్తున్నారు. దీనికి శంకర్ దర్శకులు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సినిమా చేయాలని భావిస్తున్నారు.ఇదంతా జరిగేసరికి ఈ ఏడాది ఆఖరి అవుతుంది. సినిమా విడుదల కావాలంటే మరో ఏడాది పడుతుంది. ఇలా చూసుకుంటే బుచ్చిబాబు ఉప్పెన తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని మరో చిత్రం చేసినట్లుగా అవుతుంది. సినిమాల్లో ఏదో ఏదైనా తేడా జరిగితే బుచ్చిబాబు పడ్డ కష్టం నాలుగేళ్ల కెరీర్ వృధాగా అయిపోతాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



