
"చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో" అంటూ విలన్లను రాఫ్ఫాడించేస్తుంటాడు "గ్యాంగ్ లీడర్" సినిమాలో చిరంజీవి. కానీ.. చిరంజీవి నిజజీవితంలోనే రాఫ్ఫాడించేసింది యువకథానాయకి రెజీనా. ఇటీవల వరుస పరాజయాల పుణ్యమా అని చేతిలో ఆఫర్లు లేక కొట్టుమిట్టాడుతున్న ఈ చెన్నై సుందరి మెగా 150వ సినిమా స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు ఓ నెలక్రితం గుప్పుమన్నాయి. సరైన అవకాశాలు లేక అమ్మడు ఒప్పేసుకొన్నట్లుంది.. అందులోనూ మెగా హీరోలకు పాప బాగా క్లోజ్ కదా అనుకొన్నారందరూ.
కట్ చేస్తే.. "నాకు ఐటెమ్ సాంగ్స్ చేయాల్సిన అవసరం లేదు" అంటూ ఓ ఘాటైన స్టేట్ మెంట్ ఇచ్చింది రెజీనా. ఆఫర్ వచ్చిందా లేదా? అనే విషయం పక్కనపెడితే.. చిరంజీవితో కలిసి స్టేప్పేసే సువర్ణావకాశం కాబట్టి, ఒకవేళ నిజంగానే తనను ఎవరూ సంప్రదించకపోతే "నేను చేయడం లేదు" అని చెప్పడం వేరు. అంతేకానీ.. "నాకు ఆ అవసరం లేదు" అని చెప్పడం చిరుని అవమానించినట్లే కదా అని ఫీల్ అవుతున్నారు కొందరు. ఈ విషయానికి మెగాస్టార్ ఎలాగూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు కాబట్టి.. రెజీనాయే తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఈ విషయమై ఏదైనా స్టేట్ మెంట్ ఇస్తుందేమో చూడాలి!
.jpg)





.jpg)
