.jpg)
ఇప్పుడంటే అవార్డులు కొనుక్కొంటున్నారు కానీ.. పదేళ్ళ క్రితం పరిస్థితి వేరు. ఉత్తమ నటుడిగానో, లేక నటిగానో అవార్డ్ దక్కించుకోవాలని హీరోహీరోయిన్లందరూ రాత్రుళ్ళు మాత్రమే కాకుండా పగటిపూట కూడా కలలు కనేవారు. అలాంటిది ఇప్పుడు అసలు అవార్డ్ వేడుకలంటే "ఎంటర్ టైన్మెంట్ ఈవెంట్స్" అయిపోయాయి. అవార్డ్ తీసుకోవడానికి సైతం మన స్టార్ హీరోలు రావడంలేదు. వాళ్ళకు బదులుగా సినిమా డైరెక్టరో లేక మరొకరో సదరు అవార్డ్ ను అందుకొంటున్నారు.
తాజాగా "సైమా అవార్డ్" వేడుకలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకొంది. "శ్రీమంతుడు" చిత్రానికిగానూ మహేష్ బాబుకు "ఉత్తమ నటుడు" అవార్డ్ అందించారు నిర్వాహకులు.. మహేష్ బాబు వేడుకకు హాజరు కాకపోవడంతో.. మహేష్ కు బదులుగా "శ్రీమంతుడు" టీం మెంబర్ ఒకరు ఈ అవార్డ్ ను స్వీకరించారు.
అవార్డ్ అందించినవారికి కనీసం కృతజ్ణతలు కూడా చెప్పకపోతే ఏం బాగుంటుంది అనుకొన్నాడో ఏమో తెలియదు కానీ.. సింపుల్ గా తన ట్విట్టర్ లో "Received my "Best Actor" Trophy for Srimanthudu! Thank You siima" అని ట్వీటేసి ఊరుకొన్నాడు మహేష్ బాబు!





