Home

»

Latest News

నాని కోసం విలన్ గా మారిన యంగ్ హీరో!

Jul 13, 2016 4:20PM

"జెంటిల్ మెన్" సక్సెస్ తో మాంచి జోరుమీదున్న నాని వరుసబెట్టి సినిమాలు సైన్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం విరించివర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న నాని, ఆ సినిమా అనంతరం "సినిమా చూపిస్తా మావ" ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరసారధ్యం వహిస్తారు. "నేను శైలజ" ఫేమ్ కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ కర్నూల్ లో జరగనుంది. 
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విలన్ గా నటించేందుకు ఓ యువ కథానాయకుడు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. "అందాల రాక్షసి" ఫేమ్ నవీన్ చంద్ర ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతోపాటు.. కథానాయకుడిగా తనకంటూ సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ విధంగానైనా ఎటెన్షన్ తెచ్చుకోవచ్చన్న భావనతో నవీన్ చంద్ర ఈ ప్రోజెక్ట్ ఒప్పుకొన్నట్లున్నాడు!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com