
"సరైనోడు" సినిమాలో అల్లు అర్జున్ కు ఒదినమ్మగా నటించిన తమిళ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గుర్తుందిగా. ఆ సినిమాలో "సాంబార్ సాంబార్" అంటూ ఈ అమ్మడు చేసిన రచ్చకి థియేటర్ మొత్తం ఘోల్లుమంది. అంతకుమునుపు "రన్ రాజా రన్"లో బుజ్జమ్మగా విద్యుల్లేఖ వీరాలెవల్లో విజృంభించింది. చూడడానికి బొద్దుగా ఉండడంతోపాటు.. మాంచి బేస్ వాయిస్ అమ్మడి సొంతం. అందుకే విద్యుల్లేఖకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
తాజాగా విద్యుల్లేఖ మరో తెలుగు సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకొన్నట్లు తెలుస్తోంది. అనుష్క టైటిల్ పాత్రలో "పిల్ల జమీందార్" ఫేమ్ అశోక్ తెరకెక్కించనున్న "భాగమతి" చిత్రంలో విద్యుల్లేఖ లేడీ కానిస్టేబుల్ గా కనిపించనుంది. ఈ సినిమాలో అమ్మాయిగారి పేరు "బ్రమర". మామూలుగానే విపరీతంగా నవ్వించే విద్య.. ఇక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇంకెంతగా నవ్విస్తుందో చూడాలి!






.jpg)
