Home

»

Latest News

"క్షణం" దర్శకుడికి బంపర్ ఆఫర్!

Jul 13, 2016 3:59PM

కోటిరూపాయల లోపు బడ్జెట్ లో తెరకెక్కించిన "క్షణం" చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకొని యావత్ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకొన్న యువ ప్రతిభాశాలి రవికాంత్ పేరేపు. "క్షణం" విడుదల తర్వాత రవికాంత్ కు బోలెడు ఆఫర్లు వచ్చాయి. అయితే.. మనోడు మాత్రం కంగారుపడకుండా మంచి కథను సిద్ధం చేసుకొనే పనిలో నిమగ్నమైపోయాడు. దాదాపు నాలుగు నెలలపాటు కష్టపడి ఒక ప్రోజెక్ట్ ను రెడీ చేసుకొన్నాడు. 

రవికాంత్ సిద్ధం చేసిన కథ విపరీతంగా నచ్చేసిందట రాణా బాబుకి. వెంటనే ప్రోజెక్ట్ ను ఒకే చేయడంతోపాటు తమ బ్యానర్ లోనే సినిమాను నిర్మించేందుకు తండ్రి సురేష్ బాబుని ఒప్పించేశాడు కూడా. పివిపి సంస్థ సమర్పించనున్న ఈ చిత్రంలో వెంకటేష్ కూడా నటిస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం. వెంకీకి ఎప్పట్నుంచో "మనం" లాంటి ఒక సినిమా చేయాలని ఉన్న ఆశ రవికాంత్ సినిమాతో తీరనుందని రాణా తన మిత్రులతో చెబుతున్నాడట. అతి త్వరలో ఈ ప్రోజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com