
పందిపిల్ల హీరోగా దర్శకుడు రవిబాబు తీసిన సినిమా అదుగో. తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రవిబాబు ప్రయోగం వికటించి... చేదు ఫలితాన్ని అందించింది. ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు, నటుడు కరుణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా పన్నికుట్టి. ఇందులోనూ పందిపిల్ల హీరో. కథంతా పందిపిల్ల చుట్టూ తిరుగుతుంది. తాజాగా సినిమా పోస్టర్స్, స్టిల్స్ విడుదల చేశారు. అవి చూస్తుంటే అదుగో సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నట్టు అనుమానం కలుగుతోంది. సినిమా విడుదలైతే తప్ప రీమేకా? కాదా? అనేది చెప్పలేం. ఎందుకంటే... రీమేక్ అని తమిళ సినిమా యూనిట్ ఎక్కడా చెప్పడం లేదు. 2.0 వంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమా నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ లో బడ్జెట్ పంది పిల్ల సినిమాను నిర్మిస్తుండటం విశేషం.






