Home

»

Latest News

అవసరాల.. ఎన్నాళ్ళకెన్నాళ్లకు!

Mar 2, 2019 4:43PM

 

నటుడు అవసరాల శ్రీనివాస్ చాలా సంవత్సరాల క్రితమే దర్శకుడిగా మారారు. నాగశౌర్య కథానాయకుడిగా ఊహలు గుసగుసలాడే సినిమా తీశారు. తర్వాత నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా జ్యో అచ్యుతానంద తీశారు. ఈ రెండు సినిమాల మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. మధ్యలో నటుడిగా కొన్ని  సినిమాలు చేశాడు. దర్శకుడిగా ముచ్చటగా మూడో సినిమాను శనివారం ప్రకటించారు. ఇందులోనూ నాగశౌర్య హీరో. అతడితో అవసరాలకు దర్శకుడిగా హ్యాట్రిక్ సినిమా ఇది.

నటుడిగా.. దర్శకుడిగా... రెండు పడవల మీద ప్రయాణం చేయడం వల్ల ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాల మధ్య గ్యాప్ వచ్చింది అనుకుని సరిపెట్టుకున్నా... జ్యో అచ్యుతానంద సినిమాకు, తాజాగా ప్రకటించిన సినిమాకు మధ్య ఆల్మోస్ట్ మూడేళ్ల గ్యాప్ కనిపిస్తుంది. దీనికి కారణం నాని డేట్స్ కోసం అవసరాల వెయిట్ చేయడమే అనే ఫిల్మ్ నగర్ గుసగుస. జ్యో అచ్చుతానంద తరవాత నాని హీరోగా ఓ సినిమా తీయాలని అవసరాల ప్రయత్నించారట. ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో నాగశౌర్య తో  సినిమా ప్రకటించారని టాక్.

కల్యాణ వైభోగమే సినిమాలో నాగశౌర్య సరసన నటించిన మళవికా నాయర్ ఈ సినిమాలో మరోసారి నాగశౌర్య తో రొమాన్స్ చేయనున్నారు. మార్చి రెండోవారంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com