Home

»

Latest News

200 కోట్లు ఎక్క‌డ‌, 30 కోట్లు ఎక్క‌డ‌.. ‘టాక్సిక్’కు భారీ షాక్. టెన్ష‌న్‌లో మేక‌ర్స్‌.!

Oct 9, 2026 5:36PM

‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యశ్‌కు ‘టాక్సిక్’ సినిమా పెద్ద పరీక్షగా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తే డిజిటల్ హక్కులకు భారీ ధర వస్తుందని భావించిన మేకర్స్‌కు, సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో లెక్కలు మారినట్లు తెలుస్తోంది. 

ఇక సినిమా డిజిటల్ హక్కుల కోసం తొలుత రూ.150 కోట్ల ఆఫర్ వచ్చినట్లు, నిర్మాతలు మాత్రం రూ.200 కోట్లకు పైగా ఆశించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే థియేటర్లలో వచ్చిన స్పందన తర్వాత ఓటీటీ హక్కుల కోసం వస్తున్న ఆఫర్లు సుమారు రూ.30 కోట్ల స్థాయికి పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా డిజిటల్ వెర్షన్ కోసం కొత్త ఎడిట్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ధరలు, కొత్త వెర్షన్‌పై అధికారిక ప్రకటన రాలేదు. 

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ‘టాక్సిక్’లో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఇప్పుడు డిజిటల్ హక్కుల వ్యాపారంపైనా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. మరి ఓటీటీ హక్కుల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డిజిటల్ విడుదల కోసం కొత్త వెర్షన్ తీసుకొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

 

 

[Yash Toxic Movie, Toxic OTT Rights, Yash Toxic OTT Deal, Toxic Movie Box Office, Toxic Digital Rights Price, Geetu Mohandas Toxic, Toxic OTT Version]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com