Home

»

Latest News

'టాక్సిక్' మూవీ 'పెద్దలకు' మాత్రమే?.. నిర్మాత వెంకట్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.!

Jul 23, 2026 5:24PM

పాన్ ఇండియా సూపర్‌స్టార్ యష్ 'కెజిఎఫ్' ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద నెలకొల్పిన సంచలనం అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'టాక్సిక్'. ఈ చిత్రానికి 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (A Fairy Tale for Grown-Ups) అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్‌ను ఖరారు చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ తారలు అత్యంత కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. అయితే ఈ సినిమా కంటెంట్, కథాంశం గురించి సోషల్ మీడియాలో నిరంతరం రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే 'టాక్సిక్' సినిమా ఎలాంటి కేటగిరీకి చెందుతుందనే దానిపై నిర్మాత వెంకట్ కె. నారాయణ్ పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చారు. ఇటీవల 'జన నాయగన్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నిర్మాత కీలక విషయాలను వెల్లడించారు. 'టాక్సిక్' చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే (Only for Grown-Ups) అని ఆయన బహిరంగంగా స్పష్టం చేశారు. మేము ఈ విషయాన్ని ఎక్కడా దాచలేదని, సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ రోజే 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అని స్పష్టమైన ట్యాగ్ లైన్ ద్వారా ప్రేక్షకులకు ముందే క్లారిటీ ఇచ్చామని గుర్తుచేశారు.

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌ను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా సులభంగా అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో పాటు కాస్త ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో చూపించిన కార్ సీన్, 'తబాహీ' పాటలో యష్, కియారా అద్వానీ మధ్య వచ్చే కెమిస్ట్రీ, అలాగే 'మనసాగదే' మెలోడీ సాంగ్‌లో యష్, తారా సుతారియా కనిపించిన బాత్‌టబ్ సీన్ నెటిజన్లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పోస్టర్లలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన తీరు సినిమాలోని బోల్డ్ అండ్ రా ఎలిమెంట్స్‌కు నిదర్శనంగా నిలిచింది.

సినిమా ప్రమోషన్ల వ్యూహం గురించి నిర్మాత మాట్లాడూతూ, ఇప్పటివరకు మొత్తం 3 విభిన్నమైన టీజర్లు, 2 అదిరిపోయే పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. మొదటి టీజర్ ద్వారా కథలోని మేకింగ్ క్రియేటివిటీని చూపించగా, రెండో టీజర్‌తో సినిమా యొక్క భారీ స్కేల్, విజువల్స్ స్థాయిని పరిచయం చేశామన్నారు. ఇక మూడో టీజర్‌లో సినిమాలో నటించిన పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్లను రివీల్ చేశామని చెప్పారు. ప్రత్యేకంగా ఆయా ఏజ్ గ్రూప్ ప్రేక్షకులకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో ప్రెజెంటేషన్, క్యారెక్టర్ స్టైలింగ్ డిజైన్ చేసినట్లు వెల్లడించారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ్, హీరో యష్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్‌గా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కథనం, మేకింగ్ పరంగా సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా రూపొందుతున్న ఈ డార్క్ ఏ-సర్టిఫైడ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

 

 

Yash, Toxic Movie, Toxic A Fairy Tale for Grown Ups

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com