Home

»

Latest News

'జననాయగన్' కి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా!..మరి మిగతా వాళ్ళకి

Jul 23, 2026 5:02PM

 

వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ దగ్గర జన నాయగన్(జన నాయకుడు) జోరు చూస్తుంటే తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందేమో అనిపిస్తుంది. తమిళనాడులో మెజారిటీ రివ్యూస్ మూవీ పర్లేదని చెప్తున్నా తెలుగు రివ్యూస్ మాత్రం కొంచం నెగిటివ్ గా వస్తున్నాయి. ఇందుకు కారణం బాలకృష్ణ వన్ మాన్ షో భగవంత్ కేసరి కథతోనే జన నాయకుడు తెరకెక్కడం. కాకపోతే విజయ్ నటనకి మాత్రం మంచి పేరు వస్తుంది. జన నాయగన్ కోసం   విజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తీసుకున్న రెమ్యూనరేషన్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

 విజయ్(Vijay)220 కోట్ల నుండి 250  కోట్ల వరకు భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు టాక్. మరి ఇదే నిజమైతే  భారతదేశ సినీ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్న అతికొద్దిమంది అగ్ర కథానాయకులలో విజయ్ అగ్రస్థానంలోనిలిచినట్టే. పూజా హెగ్డే  6 కోట్లు. విలన్ గా చేసిన బాబీ డియోల్ 5 కోట్లు, ప్రకాష్ రాజ్ 5 కోట్లు ప్రియమణి 3 కోట్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్  3 కోట్లు, నరేన్ 2.5 కోట్లు పారితోషికం పొందినట్లు సమాచారం.  మమితా బైజూ 1 కోటి వరకు తీసుకున్నారని చెప్తున్నారు.


  also read: జననాయగన్ ని త్రిష ఏ థియేటర్ లో చూసిందంటే.. అక్కడే ఎందుకు!

తెర వెనక ఉన్న వారి విషయానికి వస్తే దర్శకుడు హెచ్. వినోత్ తన కెరీర్‌లోనే అత్యధికంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ పొంది రికార్డు సృష్టించాడని చెప్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ రవిచందర్ 13 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ భారీ వ్యయానికి తగ్గట్టే 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లో ఊచకోత కోసింది. భారతదేశంలో ఇప్పటికే దాదాపు రూ. 20 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ సాధించగా, ఓవర్సీస్ లో ప్రి సేల్స్  15 కోట్లు దాటాయి. తొలిరోజే ఇండియాలో . 60 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా  90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని, తొలి వీకెండ్ నాటికి ఇండియాలో 150-180 కోట్లు, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 250 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ మునుపటి ఇండస్ట్రీ హిట్స్ అయిన 'లియో' (. 606 కోట్లు), 'గోట్ (GOAT)' (. 458 కోట్లు) రికార్డులను తిరగరాస్తూ 'జన నాయగన్' సరికొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి!

jana nayagan, jana nayakudu, vijay, pooja hegde, h vinoth, mamitha baiju

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com