Home

»

Latest News

జననాయకుడు vs చెన్నై లవ్ స్టోరీ.. తెలుగు ప్రేక్షకులు ఆ వైపే ఎందుకు!

Jul 23, 2026 5:32PM

 

ఈ రోజు థియేటర్లలో తిష్ట వేసిన దళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో 'జననాయకుడు'కి ఆశించిన స్థాయిలో టాక్ రావడం లేదు. గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ వన్ మాన్ షో సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'నే మళ్ళీ తెరకెక్కించడంతో మన దగ్గర వర్క్ అవుట్ కాదని, తమిళనాడులో వర్క్ అవుట్ అవుతుందనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ విశ్లేషకులు చెప్తున్నారు. 

దీంతో ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' కి అనూహ్యమైన ప్లస్ పాయింట్‌గా మారింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా చేయగా 'బేబీ', 'కలర్ ఫోటో' చిత్రాల దిగ్గజ నిర్మాత సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి కట్స్ లేకుండా,పూర్తి పాజిటివ్ వైబ్స్‌తో థియేటర్లలోకి అడుగుపెడుతోంది. సరిగ్గా ఈ సమయంలో పెద్ద సినిమా అయిన 'జన నాయకుడు' కి ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో, యూత్‌ఫుల్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులు, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలని ఆదరించే సినీ ప్రియులు ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్స్ కి పోటెత్తుతారని అంటున్నారు.


Also read: 'జననాయగన్' కి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా!..మరి మిగతా వాళ్ళకి


 దీంతో పేయిడ్ ప్రీమియర్లపై మేకర్స్ పెట్టిన నమ్మకం నూటికి నూరు శాతం నిజమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం పోటీలో ఇతర పెద్ద సినిమాలేవీ లేకపోవడం, జన నాయకుడు ప్రభావం తగ్గడం మూలంగా ఈ వారం ఆడియెన్స్ కి 'చెన్నై లవ్ స్టోరీ' ఒకే ఒక్క బెస్ట్ ఛాయిస్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సపోర్ట్ ఇవ్వడం, మణిశర్మ అందించిన అద్భుతమైన మెలోడీలు సినిమాకి మరింత హైప్ తీసుకువచ్చాయి. 'చెన్నై లవ్ స్టోరీ' కనుక ప్రేక్షకుల హృదయాలని తాకితే, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ హిట్‌గా నిలవడం ఖాయం. కాకపోతే కంటెంట్ బాగుంటేనే సదరు విజయం లాభాలు ఇచ్చే దాకా వెళ్ళిపోని అతిధిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
vijay, jana nayakudu, chennai love story, kiran abbavaram

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com