ఎన్టీఆర్ ని గుడ్డిగా నమ్ముతున్న యశ్ రాజ్ ఫిలిమ్స్!
on Jun 2, 2025
'వార్-2' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది. దీంతో బిజినెస్ ఆఫర్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. అయితే తెలుగు రిలీజ్ విషయంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. (War 2)
బాలీవుడ్ సినిమా కావడం, హృతిక్ రోషన్ కూడా ఉండటంతో.. వార్-2 విషయంలో ఎన్టీఆర్ కి అంతగా ప్రాధాన్యత ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ, యశ్ రాజ్ ఫిలిమ్స్ మాత్రం ఎన్టీఆర్ కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. హృతిక్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేయని మేకర్స్.. ఎన్టీఆర్ బర్త్ డేకి ఏకంగా టీజర్ ని రిలీజ్ చేశారు. దానిని బట్టే ఎన్టీఆర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఎన్టీఆర్ స్టార్డంని నమ్మి.. తెలుగులో సొంత విడుదలకు యశ్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తెలుగునాట ఎన్టీఆర్ కి తిరుగులేని క్రేజ్ ఉంది. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్లకు పైగా గ్రాస్, ఫుల్ రన్ లో దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది కేవలం ఎన్టీఆర్ స్టార్డంతోనే సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడ్డాయి. అందుకే 'వార్-2' తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం వంద కోట్లకు అటుఇటుగా ఆఫర్లు వస్తున్నా.. తెలుగులో సొంతంగా విడుదల చేయాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్ణయించుకుందట. టాక్ తో సంబంధం లేకుండా తెలుగు వెర్షన్ కనీసం రూ.300 కోట్ల గ్రాస్ రాబడుతుందని మేకర్స్ నమ్ముతున్నారట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
