వరల్డ్ ఆఫ్ డాన్స్ లో మెగా బ్రదర్స్ సాంగ్స్!!
on May 8, 2019

వరల్డ్ ఆఫ్ డాన్స్ షోలలో కూడా మన తెలుగు సాంగ్స్ స్టామినా ఏంటు ప్రూవ్ చేసుకుంటున్నాయి. అది కూడా మెగా బ్రదర్స్ సాంగ్స్ కావడం విశేషమనుకుంటే ...మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు కావడం మరో విశేషం అని చెప్పాల్సిందే. గతంలో ఇంటర్నేషనల్ డాన్స్ లో మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెం 150 సినిమాలో `సుందరి పాటకు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సర్థార్ గబ్బర్ సింగ్ లోని `వాడెవడన్నా...వీడెవడన్నా పాటకు వరల్డ్ ఆఫ్ డాన్స్ స్టేజ్ పైన ప్రదర్శన ఇచ్చారు. దీంతో పాటు బాహుబలి మ్యూజిక్ న్ కుబా ప్లే చేసారు. ఈ సందర్భంగా మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. `` వావ్ వాట్ ఏ బ్రిటియంట్ పర్ఫార్మెన్స్ ...నా మ్యూజిక్ పబ్లిక్ తో డాన్స్ చేయించడం చాలా హ్యాపీగా ఉంది. లవ్ యు గయ్స్ అంటూ `కీప్ రా`కింగ్స్` అంటూ ట్టీట్ చేసారు దేవి. మన తెలుగు సినిమానే కాదు పాటలు కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాయంటూ సంబరపడుతున్నారు టాలీవుడ్ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



