మూడోసారి ప్రెగ్నెంట్ అయిన 'వండర్ వుమన్'
on Mar 2, 2021
'వండర్ వుమన్' మూవీతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆరాధ్య తారగా మారింది గల్ గదోత్. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కు ఇన్స్పైర్ అయిన అమ్మాయిలు, ఆమె బ్యూటీతో లవ్‌లో పడిపోయారు. ఒకవైపు ప్రొఫెషనల్ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతుంటే, మరోవైపు ఆమె వైవాహిక జీవితం రోజురోజుకూ మరింత ఆనందకరంగా మారుతోంది. ఇప్పుడు ఆమె తన మూడో ప్రెగ్నెన్సీని అందమైన విధానంలో అనౌన్స్ చేసింది.
ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో పాల్గొన్న గల్ గదోత్ను చూసినవాళ్లంతా ఆమె మరోసారి గర్భవతి అయినట్లుగా కనిపిస్తోందంటూ చెప్పుకున్నారు. అది నిజమేనంటూ, గుడ్ న్యూస్‌ను తాజాగా పంచుకుంది గదోత్. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ క్యూట్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసిన ఆమె దానికి, "Here we go again." అనే క్యాప్షన్ జోడించింది. ఆ ఫొటోలో భర్త జరోన్ వర్సానోతో పాటు బెడ్‌పై గదోత్ వాలి ఉండగా, ఆమెకు చెరోపక్క కూతుళ్లు అల్మా, మాయా పడుకొని నవ్వులు చిందిస్తున్నారు. భర్త, కూతుళ్లు ఇద్దరూ గదోత్ పొట్టపై చేతులు పెట్టి ఉండటం గమనార్హం. ఆ ఫొటోతో, దానికి పెట్టిన క్యాప్షన్‌తో తాను మూడోసారి గర్భం దాల్చినట్లు అనౌన్స్ చేసింది గదోత్.
2006లో ఒక పార్టీలో ఇజ్రాయెలీ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జరోన్ వర్సానోను తొలిసారి కలిసింది గదోత్. ఆ ఇద్దరి మధ్య పదేళ్ల తేడా ఉంది. ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఎక్కువ కాలం టైమ్ తీసుకోలేదు వర్సానో. 2008లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2011లో పెద్ద కూతురు అల్మా పుట్టగా, ఆరేళ్ల తర్వాత, 2017లో రెండో కూతురు మాయ జన్మించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కనేందుకు రెడీ అవుతోంది 'వండర్ వుమన్'.
Also Read