ఎన్టీఆర్ దెబ్బకు షారుఖ్ ఖాన్ అవుట్!
on Jul 9, 2025
ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా ముందుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన సినిమాలు బాలీవుడ్ లో నాలుగు ఉండగా, టాలీవుడ్ లో ఏకంగా ఏడు ఉన్నాయి. బాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించిన సినిమాలు 'జవాన్', 'ఆదిపురుష్', 'యానిమల్', 'పఠాన్'. వీటిలో 'ఆదిపురుష్' ప్రభాస్ సినిమా కావడం విశేషం. బాలీవుడ్ హీరోల విషయానికొస్తే.. 'జవాన్', 'పఠాన్'తో షారుఖ్ ఖాన్ రెండుసార్లు, 'యానిమల్'తో రణబీర్ కపూర్ ఒక్కసారి ఈ ఫీట్ సాధించారు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ ఇప్పటిదాకా ఓపెనింగ్ డే వంద కోట్ల గ్రాస్ సాధించలేకపోయారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పుణ్యమా అని హృతిక్ కి ఆ ఫీట్ సాధించే ఛాన్స్ వచ్చింది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం 'వార్-2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లు గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం.. ఎన్టీఆర్ స్టార్డం ఈ సినిమాకి తోడు కావడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఫస్ట్ డే వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు టాలీవుడ్ లో ఏడు ఉండగా.. అందులో ఎన్టీఆర్ నటించిన సినిమాలు రెండున్నాయి. 'ఆర్ఆర్ఆర్' రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, 'దేవర' రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే సినిమా జానర్, కంటెంట్ తో సంబంధం లేకుండా.. మొదటి రోజే కనీసం వంద కోట్ల గ్రాస్ రాబట్టగల స్టార్డం ప్రస్తుతం ఎన్టీఆర్ సొంతం. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకతో పాటు యూఎస్ లో ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ ఉంది. దాంతో ఒక్క తెలుగు వెర్షన్ ద్వారానే 'వార్-2'కి మొదటి రోజు వంద కోట్లు వచ్చినా ఆశ్చర్యంలేదు. మరోవైపు వార్-2 అనేది పక్కా హిందీ ఫిల్మ్, దానికితోడు హృతిక్ ఉండటంతో.. నార్త్ ఇండియాతో పాటు, ఓవర్సీస్ లోనూ ఇది మంచి వసూళ్లు రాబట్టే అవకాశముంది. దాంతో ఫస్ట్ డే ఈ మూవీ రూ.150 నుండి రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
ఓపెనింగ్ డే కలెక్షన్ పరంగా ప్రస్తుతం బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ టాప్ లో ఉంది. అది మొదటి రోజు రూ.120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు 'వార్-2' ఆ రికార్డుని సునాయాసంగా బ్రేక్ చేస్తుందనే అంచనాలున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
