'లైగర్'తో విజయ్ 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంటాడా?
on Aug 24, 2022

విజయ్ దేవరకొండ గత చిత్రాలు 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలినప్పటికీ.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం ఇది విజయ్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు.. 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడం. టీజర్, ట్రైలర్ తోనే పూరి-విజయ్ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగింది. ఇది పూరి, విజయ్ ల కెరీర్ లలో రికార్డు బిజినెస్ కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లోనే రూ.60 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది 'లైగర్'. నైజాంలో రూ.25 కోట్లు, సీడెడ్ లో రూ.9 కోట్లు, ఆంధ్రాలో రూ.28 కోట్లతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.62 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. కర్ణాటకలో రూ.5.20 కోట్లు, తమిళనాడులో రూ.2.50 కోట్లు, కేరళలో రూ.1.20 కోట్లు, నార్త్ ఇండియా రూ.10 కోట్లు, ఓవర్సీస్ లో రూ.7.50 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.88.40 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. అంటే ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోందన్నమాట.
విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'గీత గోవిందం' ఫుల్ రన్ లో రూ.70 కోట్ల షేర్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు 'లైగర్' ఏకంగా రూ.90 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. రేపే(ఆగస్ట్ 25న) 'లైగర్' విడుదల కానుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే పూరి-విజయ్ కాంబో క్రేజ్ అనేది ఓపెనింగ్స్ వరకు పనికొస్తుంది కానీ లాంగ్ రన్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి. ఒకవేళ 'లైగర్' మూవీ టాక్ తెచ్చుకొని రూ.90-100 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తే.. విజయ్ స్టార్ హీరోల లిస్టులో అధికారికంగా చేరిపోయినట్టే లెక్క.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



