నెలకే మరో సినిమాతో వస్తున్నాడు.. ఈసారైనా హిట్ కొడతాడా?
on Feb 14, 2023

యంగ్ హీరో సంతోష్ శోభన్ ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది 'కళ్యాణం కమనీయం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంతోష్.. నెలకే మరో సినిమాతో రాబోతున్నాడు. అదే 'శ్రీదేవి శోభన్ బాబు'. వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సంతోష్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
'తను నేను'తో హీరోగా పరిచయమైన సంతోష్.. 'పేపర్ బాయ్'తో పరవాలేదు అనిపించుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో 'ఏక్ మినీ కథ' నేరుగా ఓటీటీలో విడుదలైంది. మారుతి దర్శకత్వం వహించిన 'మంచి రోజులు వచ్చాయి' ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. గతేడాది నవంబర్ లో వచ్చిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత రెండు నెలకే ఈ ఏడాది జనవరిలో 'కళ్యాణం కమనీయం'తో పలకరించాడు సంతోష్. కానీ ఇది ఓటీటీ సినిమా అనే పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు నెలకే ఈ ఫిబ్రవరి 18న 'శ్రీదేవి శోభన్ బాబు'తో రాబోతున్నాడు. విడుదలకు మూడు రోజులే ఉన్నా ఈ సినిమా మీద ఎలాంటి బజ్ లేదు. మౌత్ టాక్ మీదే ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంది. వరుసగా బాక్సాఫీస్ వార్ కి దిగుతున్న సంతోష్ ఈ మూవీతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.
మరోవైపు సంతోష్ చేతిలో 'అన్ని మంచి శకునములే', 'ప్రేమ్ కుమార్' సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ కుర్ర హీరోకి వరుస అవకాశాలైతే వస్తున్నాయి కానీ విజయాలు మాత్రం వరించడం లేదు. మరి 'శ్రీదేవి శోభన్ బాబు' నుంచైనా ఈ యువ హీరో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



