రష్మిక సెంటిమెంట్.. వర్కవుట్ అవుతుందా!
on Aug 13, 2023

శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఈమె హీరోయిన్‌గా నటించిన సినిమాల్లో ఈ ఏడాది మన ముందుకు రాబోతున్న సినిమా యానిమల్. రణ్‌భీర్ కపూర్ హీరో. టి సిరీస్ ప్రొడక్షన్ హౌస్‌లో మన అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ఈ మూవీని తెరకెక్కించారు. డిసెంబర్‌లో మూవీ రిలీజ్ కాబోతుంది. నిజానికి ఆగస్ట్ 11న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్స్ మూవీ వస్తుండటం ఇవన్నీ వెరసి యానిమల్ సినిమాను డిసెంబర్‌కి వాయిదా వేశారు.
యానిమల్ పాన్ ఇండియా మూవీగా డిసెంబర్‌లో రానుండగా.. సినిమా సక్సెస్‌పై హీరోయిన్ రష్మిక మందన్న చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అందుకు కారణం.. ఆమె సెంటిమెంట్ లెక్కలు వేసుకుంటుంది. అదెలాగంటే.. రష్మిక తొలి చిత్రం కన్నడలో చేసింది అదే కిరిక్ పార్టీ. రక్షిత్ శెట్టితో కలిసి చేసింది. ఆ సినిమా డిసెంబర్‌లోనే విడుదలైంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రష్మిక నటనకు చాలా మంచి మార్కులే పడ్డాయి. అక్కడ నుంచి ఛలోతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.
ఈ నేపథ్యంలో ఆమె నటించిన తొలి పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్' సినిమా డిసెంబర్‌లో విడుదలైంది. ఆ సినిమా ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. అందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు యానిమల్ కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే ఈ బ్యూటీ డాల్ సంతోషంగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. మరీ ఈమె సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



