రష్మిక ఆ షాక్ నుంచి బయటపడుతుందా..?
on Jun 18, 2025
పాన్ ఇండియా హీరోయిన్స్ లో రష్మిక మందన్న (Rashmika Mandanna) టాప్ ఫామ్ లో ఉంది. 'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా'తో మూడు వరుస భారీ పాన్ ఇండియా సక్సెస్ లను చూసింది. దాంతో రష్మికకు లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ అయిపోయింది. అయితే 'సికందర్'తో ఆమె విజయపరంపరకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు రష్మిక 'కుబేర'తో కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా? అనే ఆసక్తి నెలకొంది.
నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కుబేర' (Kuberaa). జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టనుంది. శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. కుబేరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకొని, ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా? అనేది చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకి పాజిటివ్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశముంది.
'కుబేర' సక్సెస్ అనేది రష్మికకు కీలకం. 'కిరిక్ పార్టీ', 'ఛలో', 'గీత గోవిందం' వంటి పలు విజయాలను కెరీర్ ప్రారంభంలోనే చూసిన రష్మిక.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక 'పుష్ప'తో పాన్ ఇండియా హీరోయిన్ గా అవతరించింది. అదే జోష్ లో 'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా' సినిమాలతో మూడు వరుస బ్లాక్ బస్టర్లను అందుకొని.. తిరుగులేని పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి సమయంలో ఆమెకు 'సికందర్' రూపంలో షాక్ తగిలింది. అయినప్పటికీ రష్మిక లక్కీ హీరోయిన్ అనే ముద్రను ఆ సినిమా చెరిపేయలేకపోయింది. అయితే ఇప్పుడు 'కుబేర' రూపంలో కూడా షాక్ తగిలితే మాత్రం.. రష్మిక జోరుకి బ్రేకులు పడే ప్రమాదముంది.
అసలే నెక్స్ట్ రష్మిక లిస్టులో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఉంది. దానిని పూర్తిగా రష్మిక తన భుజాలపై మోయాల్సి ఉంది. రష్మిక సక్సెస్ లో ఉంటే.. తన బ్రాండ్ 'గర్ల్ ఫ్రెండ్' సినిమాకి కలిసొస్తుంది. లేదంటే మెజారిటీ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ లాగానే సౌండ్ చేయకుండా సైలెంట్ అయిపోతుంది. మొత్తానికి 'కుబేర' సక్సెస్ అయితే.. 'గర్ల్ ఫ్రెండ్'కి బాగా ప్లస్ అవుతుంది. లేదంటే, ఎంతోకొంత నెగటివ్ ప్రభావం పడే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.
సినిమాల ఎంపిక విషయంలో ప్రస్తుతం రష్మిక ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకట్రెండు హిందీ సినిమాలు తప్ప.. ఇప్పుడు ఆమె చేతిలో భారీ సినిమాలు కూడా ఏమీ లేవు. 'కుబేర' హిట్ అయితే.. రష్మిక లక్కీ లేడీ అనే ఇమేజ్ మరింత బలపడి.. ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టే అవకాశాలున్నాయి. మరి 'కుబేర'తో రష్మిక కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
