Home

»

Latest News

రాశీ ఖ‌న్నా.. `థాంక్ యూ`తోనైనా ట్రాక్ లోకి వ‌చ్చేనా!

Jul 6, 2022 3:36PM

ఈ త‌రం క‌థానాయిక‌ల్లో రాశీ ఖ‌న్నా తీరే వేరు. ఒక‌వైపు గ్లామ‌ర్ రోల్స్ లో క‌నువిందు చేస్తూనే.. మ‌రోవైపు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్ట‌ర్స్ లోనూ అల‌రిస్తోంది. అలాగే తెలుగు, త‌మిళ్, హిందీ, మ‌ల‌యాళం అంటూ ప‌లు భాష‌ల్లో సంద‌డి చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలుగులో ఈ మ‌ధ్య రాశీ ఖ‌న్నా ట్రాక్ రికార్డ్ అంత‌గా బాగుండ‌డం లేదు.  ఆ మ‌ధ్య `వెంకిమామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాశి.. రీసెంట్ టైమ్స్ లో `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`, `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`తో ట్రాక్ త‌ప్పింది. ఈ నేప‌థ్యంలో.. ఈ నెల 22న విడుద‌ల కానున్న `థాంక్ యూ` ఫ‌లితం మిస్ ఖ‌న్నాకి ఎంతో కీల‌కంగా మారింది. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ కెప్టెన్ విక్ర‌మ్ కె. కుమార్ రూపొందించిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో రాశీ ఖ‌న్నాతో పాటు అవికా గోర్, మాళ‌వికా నాయ‌ర్ కూడా నాయిక‌లుగా క‌నిపించ‌నున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలందించాడు. మ‌రి.. `థాంక్ యూ` రాశి కెరీర్ కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com