
డైరెక్టర్.. సినిమాని ఫ్యాషన్ గా, ప్రాణంగా భావించి ఎంతో కష్టపడి తొలి అవకాశం సంపాదిస్తాడు. సూపర్ హిట్ కూడా అందుకొని ప్రేక్షకులు, సినీ ప్రేమికుల మనసుల్లో తెలుగు సినిమాకి మంచి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ వచ్చాడు. ఇక మనకి తన నుంచి వచ్చే ప్రతి సినిమా సరికొత్త సినీ పండుగని తీసుకొస్తుందని భావిస్తుంటారు.
కానీ రెండో సినిమా లేదా ఆ తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్నాయి. పైగా సినిమాలు పూర్తి చేయడానికి 3 నుండి 6 ఏళ్ల సుదీర్ఘ సమయం తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. అసలు తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన దర్శకుల క్రియేటివిటీ ఆ తర్వాత ఎందుకు తగ్గిపోతోంది? వారి వరుస వైఫల్యాలు లేదా ఆలస్యాల వెనుక ఉన్న అసలైన పరిశ్రమ సమీకరణాలు ఏమిటో లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొదటి సినిమా విజయం వెనుక దర్శకుడు ఏళ్ల తరబడి పడ్డ కష్టం, సుదీర్ఘమైన స్క్రిప్ట్ వర్క్ ఉంటాయి. దర్శకుడి వద్ద 5 నుంచి 10 ఏళ్లుగా రూపుదిద్దుకున్న ఒకే ఒక్క అత్యుత్తమ ఐడియా లేదా కలల ప్రాజెక్టుని తొలి సినిమాగా తెరకెక్కిస్తారు. కానీ ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వగానే పరిశ్రమ వారిపై ఉంచే అంచనాల భారం ఊహించని రీతిలో పెరిగిపోతుంది.

ఇది కూడా చదవండి: సినిమా హీరోలకి పోలీసుల వార్నింగ్: కలికాలం అంటే ఇదే మరి!
మొదటి సినిమాకు దక్కిన విజయం ఇచ్చే ‘సెకండ్ సినిమా ఫోబియా’ వారి సృజనాత్మకతను ఒత్తిడికి గురిచేస్తుంది. దాంతో రెండవ కథను ఎంచుకునే క్రమంలో తీవ్రమైన అయోమయం నెలకొంటుంది. మొదటి చిత్రానికి ఉన్న సహజమైన డెడికేషన్, సమయం రెండో సినిమా స్క్రిప్ట్‌కు లభించకపోవడం వల్ల కథనం బలహీనపడి డిజాస్టర్లుగా మారుతుంటాయి.
దీనికి తోడు ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్, పెరిగిన బడ్జెట్ సమీకరణాలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు తొలి హిట్ తర్వాత వెంటవెంటనే సినిమాలు చేసిన దర్శకులు, ఇప్పుడు స్టార్ హీరోల కాల్షీట్లు దక్కించుకోవాలనే మోజులో భారీ కాన్వాస్ వైపు పరుగులు తీస్తున్నారు.100 కోట్ల నుంచి 400 కోట్ల దాకా భారీ బడ్జెట్లతో ప్రాజెక్టులను నిర్మించడం వల్ల నిర్మాణం పూర్తి కావడానికి 2 నుండి 3 ఏళ్ల సమయం పడుతోంది. ఈ క్రమంలో కథలో ఉండాల్సిన అసలైన ఎమోషన్, స్క్రీన్‌ప్లే బలం కంటే విజువల్ గ్రాండియర్, మాస్ ఎలివేషన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు.

అలాగే మార్కెట్ ఒత్తిళ్లు కూడా వీరి క్రియేటివిటీని దెబ్బతీస్తున్నాయి. మొదటి సినిమా విజయం సాధించగానే స్టార్ హీరోలు, కార్పొరేట్ నిర్మాతలు ఆ దర్శకుడి చుట్టూ చేరి తమ ఇమేజ్, బిజినెస్ లెక్కలకు అనుగుణంగా మార్పులు చేయాలని ఒత్తిడి తెస్తారు. దీనివల్ల దర్శకుడు తన సొంత శైలిని, కథ చెప్పే విధానాన్ని కోల్పోయి వాణిజ్య సూత్రాల ఉచ్చులో పడిపోతాడు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా భారీ సినిమాలు లేదా స్టార్ హీరో చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో చిన్న, మధ్యస్థాయి కంటెంట్ ఆధారిత సినిమాలకు స్కోప్ తగ్గిపోతోంది. ఫలితంగా క్రియేటివిటీ తగ్గడం కంటే కూడా, విపరీతమైన అంచనాలు, మారిన ప్రేక్షకు అభిరుచికి తగ్గట్టుగా అప్డేట్ కాకపోవడం, మరియు భారీ బడ్జెట్ అదుపు తప్పడమే ఈ ‘వన్ ఫిలిం వండర్స్’ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
కాకపోతే మొదటి సినిమా తర్వాత హిట్ అందుకున్న దర్శకులు కూడా ఉన్నారు. కానీ మెజారిటీగా కనపడే విషయమే ఎప్పుడు రాజ్యమేలుతుఉంటుంది.
మీకు నచ్చవచ్చు :నయనతారకి షాక్!
[Why Telugu Directors Fail After First Hit, Telugu Directors Failure, Tollywood One Film Wonders, First Movie Success Reasons, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






