
హీరో.. స్క్రీన్ పై విలన్స్ ని తుక్కు రేగకొడతాడు.. తొక్కి నార కూడా తీస్తాడు. దీంతో బయట కూడా హీరోని హీరోలాగే కొలిచే అభిమానులకి కొదవ ఉండదు. ఇప్పుడు ఆ అభిమానమే హీరో పాలిట శాపంగా మారింది. ఈ మాటని స్వయంగా పోలీసులే చెప్తుండటంతో పాటు చిన్న సైజు వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను వణికిస్తున్న వరుస సంఘటనల నేపథ్యంలో ముంబై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రముఖ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన సంచలనాత్మక కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ముంబైలోని రద్దీ ప్రాంతమైన జుహులోని పుష్పా పార్క్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని తన లగ్జరీ బీఎండబ్ల్యూ కారులో టైగర్ ష్రాఫ్ వెళుతుండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

క్షణాల వ్యవధిలో ఏకంగా ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరపడంతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మొదట ఈ శబ్దాలను గమనించిన స్థానికులు దీపావళి టపాసులు పేలుస్తున్నారని భావించినప్పటికీ, తర్వాత అది తుపాకీ కాల్పులని తేలడంతో షాక్‌కు గురయ్యారు.
ఈ ఉద్దేశపూర్వక దాడిలో అదృష్టవశాత్తు టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఆయన డ్రైవర్ తో పాటు మరో ఆటోరిక్షా డ్రైవర్ గాయపడ్డారు. ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం, అభిమానులు గుమికుడి ఉండటమే. దీంతో దుండగులు వాళ్ళలోకి ప్రవేశించి ఈ దాడి చేసారు.

దీంతో హీరోలు ఎవరు అభిమానులతో కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదని, సెల్ఫీలు, ఫోటోలు దిగకూడదని, అసలు రద్దీ ప్రాంతాలకి వెళ్లకూడదని కఠినమైన భద్రతా మార్గదర్శకాలని జారీ చేశారు. నటీనటులు తమ పబ్లిక్ మూవ్‌మెంట్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా హీరోల అభిమానులు కలికాలం అంటే ఇదేనని తెగ బాధపడుతున్నారు. మరి ఆ బాధ ఏంటో తెలిసిందే కదా!
మీకు నచ్చవచ్చు: సీన్ ఎందుకు హిట్ అయ్యిందో తెలుసా!
Tiger Shroff Firing Mumbai Police Alert, tiger shroff firing, mumbai police alert, bollywood security, lawrence bishnoi gang, juhu shooting incident





