Home

»

Latest News

రేణూ దేశాయ్ ఫస్ట్ రియాక్షన్: పవన్ కళ్యాణ్ విడాకులపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.!

Nov 10, 2026 3:20PM

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా జరిగితే చాలు.. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా విడాకులు, కుటుంబ సమస్యలు వంటి సున్నితమైన విషయాలపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వార్తల నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి చర్చే జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ స్పందించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కష్టాల్లో ఉన్న వ్యక్తిని మరింతగా దూషించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా పవన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి.

ఆమె తన పోస్ట్‌లో కొన్ని విషయాలను చాలా ఘాటుగా ప్రస్తావించారు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా తిట్టడం, విమర్శించడం నైతికంగా సరైనది కాదని అన్నారు. ఇప్పటికే కిందపడిపోయిన వ్యక్తిని మళ్లీ తొక్కడం అమానవీయమని పేర్కొన్నారు. వారు ఏ స్థాయిలో ఉన్నా మనలాంటి మనుషులేనని.. ఎవరికో ఒకరికి బిడ్డలని, తల్లిదండ్రులని, తోబుట్టువులని గుర్తుంచుకోవాలని సూచించారు.

అంతేకాదు.. తన పోస్ట్‌లో రేణూ దేశాయ్ చెప్పిన ఓ మాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "మనమే ఎన్నో లోపాలున్న గాజు ఇళ్లలో నివసిస్తూ.. ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరకూడదు" అంటూ ట్రోలర్స్‌కు చురకలు అంటించారు. ఎదుటివారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే ముందు మన జీవితాల్లోని లోపాలను కూడా చూసుకోవాలని ఆమె చెప్పకనే చెప్పారు.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా సంచలన నిర్ణయం.!

ఇక ఈ పోస్ట్‌లో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. తాను ఇలా మాట్లాడినందుకు ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని రేణూ స్పష్టం చేశారు. ముఖ్యంగా తనకు ఎలాంటి పేటీఎం పేమెంట్స్ రాలేదని సెటైరికల్‌గా పేర్కొన్నారు. తన మెదడులో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా పనిచేస్తోంది కాబట్టే మానవత్వంతో స్పందిస్తున్నానంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

అదే సమయంలో తన పోస్ట్‌ను చూసి అనవసరమైన ఊహాగానాలు చేయొద్దని కూడా ముందుగానే హెచ్చరించారు. తాను చెప్పాలనుకున్నది కేవలం సమాజంలో మనుషులకు ఉండాల్సిన కనీస దయ, సానుభూతి గురించేనని స్పష్టం చేశారు.

కాగా పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2012లో విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో ఇద్దరూ తమ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పవన్, అన్నా లెజినోవా విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రేణూ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

మీకు నచ్చవచ్చు:
రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. అలా అంటారనే ఆరోజు మౌనంగా ఉన్నా.!
బిగ్ ట్విస్ట్.. విడాకుల తర్వాత మళ్ళీ కలిసిపోయిన స్టార్ కపుల్.?

 

 

 

[Renu Desai Instagram Post, Pawan Kalyan Anna Lezhneva Divorce, Pawan Kalyan Divorce, Pawan Kalyan Separation, Pawan Kalyan, Anna Lezhneva, Renu Desai, Divorce News, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com