Home

»

Latest News

‘ప్యారడైజ్’పై నెగెటివిటీ: నానిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?.. వెనకుండి నడిపిస్తుంది ఎవరు.?

Sep 24, 2026 11:25AM

తెలుగునాట నానికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ నానికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన కథల ఎంపిక, నటన కారణంగా ఓ ప్రత్యేకమైన ఆడియన్స్‌ను సంపాదించుకున్నారు.

అలాంటి నాని నటించిన ‘ది ప్యారడైజ్’పై మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. సినిమా విడుదలైన వెంటనే భారీగా నెగెటివ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఏ సినిమాకి అయినా నెగెటివ్ కామెంట్స్ సహజమే అయినప్పటికీ, నాని లాంటి యంగ్ స్టార్ సినిమాకి ఈ రేంజ్ నెగటివిటీ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఒక బిగ్ స్టార్ సినిమా రిలీజ్ అయినప్పుడు.. మొదటి షో కూడా పూర్తి కాకుండానే యాంటీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి నెగటివిటీ వస్తుందో అంతటి నెగటివిటీ వస్తోంది. దీంతో నానిని టార్గెట్ చేస్తూ కొందరు కావాలనే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. 'ప్యారడైజ్' హిట్ అయితే ఎక్కడ నాని బిగ్ స్టార్ అవుతాడోనన్న భయంతోనే కొందరు ఆయనను టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ

‘ప్యారడైజ్’కు ముందు నాని వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన నటించిన గత నాలుగు సినిమాల్లో మూడు 100 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ప్యారడైజ్’ హిట్ అయితే 200-300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనే అంచనాలు విడుదలకు ముందు ఏర్పడ్డాయి. తీరా మూవీ రిలీజ్ అయ్యాక డివైడ్ టాక్ రావడంతో.. ఇదే అదునుగా నానిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూన్నాయి.

మీకు నచ్చవచ్చు:
బాక్సాఫీస్ క్లాష్.. రాయుడు ముందు నిలబడలేకపోయిన బాస్.!
రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!

 

 

 

[Negativity On Nani, Negativity On Paradise, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise Negative Talk, Paradise Public Talk, The Paradise Twitter Review, Natural Star Nani, Telugu Film News, Telugu News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com