
టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు మరోసారి గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా సీన్ ఏకంగా అంతర్జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇరాన్.. బాలయ్య సినిమా క్లిప్‌ను ఉపయోగించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ విషయంలో కఠిన వ్యాఖ్యలు చేశారు. ఒక ఒప్పందం కుదరని పక్షంలో ఇరాన్‌ను నాశనం చేసే నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చంటూ ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌ను ట్రోల్ చేసింది.
జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ తన అధికారిక ట్విట్టర్(X) ఖాతాలో ఓ 58 సెకన్ల వీడియోను షేర్ చేసింది. అందులో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’లోని ఓ యాక్షన్ సీన్ ఉంది. భారీగా ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను బాలయ్య ఎదుర్కొనే సన్నివేశాన్ని ఈ పోస్టులో ఉపయోగించారు.
‘ట్రంప్ ఇరాన్‌ను నాశనం చేస్తానంటున్నారు. కానీ ఇరాన్ అంత బలహీనమైన దేశం కాదని ఆయనకు తెలుసు’ అనే అర్థం వచ్చేలా ఇరాన్ ఎంబసీ ఈ వీడియోను షేర్ చేసింది. అంతేకాదు.. ట్రంప్ హాలీవుడ్ కంటే బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది.
ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ
అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఎంబసీ ఈ సినిమాను బాలీవుడ్ సినిమాగా పేర్కొంది. కానీ వారు షేర్ చేసిన క్లిప్ బాలీవుడ్‌కు చెందినది కాదు.. మన తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ 2023లో విడుదలైంది. బాలకృష్ణతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు ఇందులో నటించారు. యాక్షన్‌తో పాటు భావోద్వేగ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ ఓ సన్నివేశంలో ఏకంగా ఓ మ్యాన్‌హోల్ కవర్‌ను షీల్డ్‌లా ఉపయోగిస్తూ తుపాకులతో దాడి చేసే వ్యక్తులను ఎదుర్కొంటారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే యాక్షన్ సీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే సీన్ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ కావడం విశేషం.
ఇప్పటికే తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీన్లు సోషల్ మీడియాలో గ్లోబల్‌గా వైరల్ అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఓ తెలుగు సినిమా సీన్‌ను ఏకంగా ఓ దేశ రాయబార కార్యాలయం అంతర్జాతీయ రాజకీయ వ్యాఖ్యలకు సమాధానంగా ఉపయోగించడం మాత్రం ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చవచ్చు:
రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!
55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.!
[Bhagavanth Kesari Viral Video, Bhagavanth Kesari Clip, Nandamuri Balakrishna, Balakrishna Action Scene, Iran Trump Viral Video, Bhagavanth Kesari Scene, Balakrishna Viral, Iran Embassy, Donald Trump, Telugu Film News]




.webp)

