Home

»

Latest News

బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్.. బెదిరించి రూ.5.5 లక్షలు వసూలు చేశారంటూ ఆరోపణ.!

Sep 24, 2026 11:44AM

బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 8 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి వర్షిణి వెంకట్‌ ప్రస్తుతం ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. షార్ట్‌ఫిల్మ్ నిర్మాణం పేరుతో ఓ యువకుడి నుంచి డబ్బులు తీసుకోవడంతో పాటు, అనంతరం అతడిని బెదిరించి నగదు వసూలు చేశారనే ఫిర్యాదు ఆధారంగా చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వర్షిణిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పోలీసులు, ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడికి వర్షిణితో పరిచయం ఏర్పడింది. షార్ట్‌ఫిల్మ్ నిర్మించేందుకు పెట్టుబడి పెట్టాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని తరుణ్ అడగడంతో వివాదం మొదలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆగస్టు 22న గిండి ప్రాంతంలోని ఓ హోటల్‌ వద్ద తరుణ్‌ను వర్షిణి, ఆమె స్నేహితుడు సంజయ్‌తో పాటు మరో ఇద్దరు కలిశారని పోలీసులు తెలిపారు. అక్కడ తనపై దాడి చేసి రూ.50 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు తీసుకున్నారని తరుణ్ ఆరోపించాడు. అనంతరం ఫోన్ ద్వారా బెదిరింపులు రావడంతో మరికొంత డబ్బును బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వివిధ వార్తా కథనాల ప్రకారం మొత్తం రూ.5.5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.3 లక్షలు వర్షిణి బ్యాంకు ఖాతాకు, రూ.2 లక్షలు సంజయ్ ఖాతాకు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. మరో రూ.27 లక్షలు ఇవ్వాలని కూడా బెదిరించినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.

ఫిర్యాదు అందుకున్న గిండి పోలీసులు వర్షిణి, సంజయ్ సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన తర్వాత వర్షిణి ఖాతాకు డబ్బు బదిలీ అయినట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆమె నుంచి ఓ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం వర్షిణిని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.

 

 

[Varshini Venkat Arrest, Bigg Boss Fame Varshini, Varshini Venkat News, Varshini Venkat Arrested, Bigg Boss Tamil Actress, Varshini Venkat Case, Varshini Venkat Extortion Case, Varshini Venkat Police Case, Bigg Boss Tamil 8, Chennai Police, Varshini Venkat Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com