Home

»

Latest News

బ్రేకప్ ఇష్యూను శ్రుతి లైట్ తీసుకుందా?

Apr 30, 2019 11:35AM

 

శ్రుతి హాసన్ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స‌లే సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. ఇకపై తమ దారులు వేర్వేరు అని సోషల్ మీడియా సాక్షిగా స్పష్టం చేశాడు. శ్రుతి హాసన్ మాత్రం ఇప్పటివరకూ బ్రేకప్ గురించి స్పందించలేదు. మైఖేల్ కోర్స‌లే బ్రేకప్ గురించి మాట్లాడిన తరవాత శ్రుతి హాసన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ప్రేమ, పెటాకులు ప్రస్తావన లేదు. ఇంటర్వ్యూను పక్కన పెడితే... ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటోందామె. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్ గురించి పోస్ట్ చేసింది, ఇంట్లో పిల్లుల గురించి పోస్ట్ చేసింది, తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న కొత్త సినిమా గురించి మాట్లాడింది. కానీ, బ్రేకప్ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. మాట్లాడటం లేదు. శ్రుతి హాసన్ తీరు చూస్తుంటే... బ్రేకప్ ఇష్యూ గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్టుగా ఉంది. లేదంటే ఆమె దీన్ని లైట్ తీసుకుని అయినా ఉండాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com