
'నీది నాదీ ఒకే కథ'తో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల కొత్త సినిమా నటీనటుల జాబితాలో రోజుకో కొత్త పేరు చేరుతోంది. ప్రతి పేరు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతోంది. రానా దగ్గుబాటి కథానాయకుడిగా, సాయిపల్లవి కథానాయికగా వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్న సినిమా 'విరాటపర్వం'. ఇందులో సామజిక కార్యకర్తగా టబు నటించనున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఈశ్వరి రావు, జరీనా వాహెబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడీ జాబితాలో ప్రియమణి పేరు చేరింది. తెలంగాణ జానపద గాయని బెల్లి లలిత స్పూర్తితో తీర్చిదిద్దిన పాత్రలో ప్రియమణి నటించనున్నారు. ఇటీవలే దర్శకుడు ఆమెకు కథ వినిపించగా, ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహిళల పాత్రలు శక్తివంతంగా ఉంటాయని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, 'పడి పడి లేచె మనసు' నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలు కానుందని సమాచారం.




.jpg)

